ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Jan 13, 2020 , 00:26:04

జోరుగా ప్రచారం

 జోరుగా ప్రచారం
  • - యాదాద్రి అంటే కేసీఆర్‌కు అమితమైన ప్రేమ
  • - ఇక్కడ జరుగుతున్న అభివృద్ధికి అందరూ అండగా నిలువాలి
  • - పభుత్వ విప్‌ గొంగిడి సునీతాహేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి

యాదగిరిగుట్ట,నమస్తేతెలంగాణ: యాదాద్రి అభివృద్ధి ప్రపంచ చరిత్రలో నిలిచిపోయేలా జరుగుతుందని, అందుకు అనుగుణంగా యాదగిరిగుట్ట పట్టణాన్ని సర్వహంగులతో ఉన్నతంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం యాదగిరిగుట్ట పట్టణంలోని 4వ వార్డులో టీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రభుత్వ విప్‌, 6వ వార్డులో టీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని టీఆర్‌ఎస్‌ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. అంనతరం వారు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి కారుగుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లను గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంకుఠిత దీక్షతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారని గుర్తుచేశారు.

ఆలయంతో పాటు చుట్టు గుట్టలను టెంపుల్‌ సిటీగా మార్చుతున్నారని వివరించారు. ఎన్నో కాటేజీలు, భక్తుల విడిది కోసం పార్కులు, ఆహ్లాదకరమైన ప్రాంతాలు, సర్వహంగులతో బస్టాండ్‌లు, వీఐపీల విడిది కోసం ప్రెసిడెన్షియల్‌ షూట్‌ నిర్మాణంతో పాటు పట్టణంలో రోడ్డు వెడల్పు చేపట్టారన్నారు. వైటీడీఏ పరిధిలో వేల ఉద్యోగావకాశాలు రానున్నాయని వివరించారు. పట్టణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. యాదగిరిగుట్ట మున్సిపల్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చైర్మన్‌గా గెలిపించుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ వద్దకు వెళ్లి మరిన్ని నిధులు తీసుకువచ్చే అవకాశం ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటువేస్తే లాభం ఉండదని తెలిపారు.   4వ వార్డులో కాటబత్తిని స్వప్నాఆంజనేయులు, 11వ వార్డులో తాళ్లపల్లి నాగరాజు, 6వ వార్డులో వీరేంద్రనాయక్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తోటకూరి అనురాధ, మాజీ జడ్పీటీసీ కర్రె కమలమ్మ,  టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు కాటబత్తిని ఆంజనేయులు, 1వ వార్డు అభ్యర్థి గోర్ల పద్మ, 4వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థి కాటబత్తిని స్వప్న, 6వ వార్డు అభ్యర్థి వీరేంద్రనాయక్‌, 11వ వార్డు అభ్యర్థి తాళ్లపల్లి నాగరాజు, గడ్డమీది రవీందర్‌గౌడ్‌,  సయ్యద్‌ బాబా, తెల్జరి శ్రీశైలం, తాళ్ల రాంరెడ్డి, తోటకూరి బీరయ్య, ఆరె మల్లేశ్‌గౌడ్‌  పాల్గొన్నారు. 

VIDEOS

logo