సోమవారం 08 మార్చి 2021
Yadadri - Jan 13, 2020 , 00:23:49

ముగిసిన పల్లెప్రగతి

ముగిసిన పల్లెప్రగతి
  • - ముగింపు గ్రామసభలు
  • - రెండో విడుత జరిగిన పనులపై సమీక్ష
  • - పలు గ్రామాల్లో దాతలకు సన్మానం
  • - ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాల్లో కలెక్టర్‌, జేసీ తనిఖీలు

యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: పల్లెలు ప్రగతిదిశగా అడుగులు వేయాలని ప్రభుత్వం చేపట్టిన రెండో విడుత  పల్లెప్రగతి  ఆదివారం ముగిసింది. జిల్లాలోని 17 మండలాల్లోని 420 గ్రామాల్లో ముగింపు గ్రామ సభలు నిర్వహించారు. రెండో విడుతలో జరిగిన పనులపై సమీక్ష జరిపారు. పల్లెప్రగతిలో భాగంగా గ్రామాల అభివృద్ధికి సహకరించిన దాతలను సన్మానించారు. రెండో విడుతలో జరిగిన పనులపై  కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో సమీక్ష జరిపారు. నిరంతరం గ్రామాల్లో పారిశుధ్య పనులు- హరితహారం పనులు కొనసాగేలా తీసుకొనే చర్యలపై సమీక్షలో చర్చించారు. ఆత్మకూరు(ఎం) మండలంలోని రాయిపల్లిలో హరితహారంలో భాగంగా చేపట్టిన మొక్కల పెంపకాన్ని  కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ పరిశీలించారు. పల్లెర్లలో జరిగిన పల్లెప్రగతి పనులను జాయింట్‌ కలెక్టర్‌ రమేశ్‌ తనిఖీ  చేశారు. రామన్నపేట మండలం  కక్కిరేణి గ్రామంలో పల్లెప్రగతి గ్రామ సభలో నార్కట్‌పల్లి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొని చెత్తబుట్టలను పంపిణీ చేశారు. బీబీనగర్‌ మండలంలోని కొండమడుగులో నిర్వహించిన పల్లెప్రగతి గ్రామసభలో జిల్లా పరిషత్‌ సీఈవో కృష్ణారెడ్డి,  బీబీనగర్‌ మండల ప్రత్యేకాధికారి, డీఈవో చైతన్యజైని  పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో పారిశుధ్య పనులు చేపట్టారు.  ముగిసిన పల్లె ప్రగతికి సంబంధించి చేపట్టిన వివరాలను డీపీవో వనం జగదీష్‌ వివరించారు. 4వ తేదీన జిల్లాలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో డీవార్మింగ్‌ డే నిర్వహించామని చెప్పారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇమ్యూనైజేషన్‌ డే నిర్వహించినట్లు తెలిపారు. 7వ తేదీన జిల్లా వ్యవసాయ శాఖ, అధికారి ఆధ్వర్యంలో రైతులకు నూతన పథకాలపై ప్రాథమిక అవగాహన కల్పించామన్నారు. 8వ తేదీన జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో దిశ సంఘటన పై హైస్కూల్‌ విద్యార్థులకు గుడ్‌ -టచ్‌ మరియు బ్యాడ్‌ - టచ్‌ పై పైమరీ స్కూల్‌ విద్యార్థులకు అవగాహన కల్పించి జాగృతం చేసినట్లు చెప్పారు. జిల్లాలో గుర్తించిన 33 పాఠశాలల్లో బాలికలకు కరాటే విద్య అభ్యసన తరగతులు నిర్వహించామన్నారు. అదేవిధంగా రోజూ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రోడ్ల, పబ్లిక్‌ ప్రదేశాల్లో  చెత్తాచెదారం వేయకుండా జరిమానాలు విధించామన్నారు. అన్ని గ్రామాల్లో గ్రామ అభివృద్ధి కోసం, ట్రాక్టర్ల కొనుగోలు కొరకు దాతల సహకారం పొందిన విషయాన్ని వివరించారు. గ్రామాల్లో  ప్రభుత్వ కార్యాలయాలు 100 శాతం పరిశుభ్ర పరిచామన్నారు. గ్రామాల్లో హరితహారంలో భాగంగా పచ్చదనం- పారిశుధ్యం నిర్వహించామన్నారు. యాదగిరిగుట్ట మండలంలోని 23 గ్రామ పంచాయతీల్లో  గ్రామ సభలు నిర్వహించారు. పెద్దకందుకూరులో ఎన్‌ఎస్‌ఎస్‌ బృందం నిర్వహించిన శీతాకాలం శ్రమదాన కార్యక్రమానికి ముగింపు పలికారు. మాసాయిపేట గ్రామసభలో దాతలకు ఘనంగా సన్మానం చేశారు. మాసాయిపేట గ్రామ మాజీ ఎంపీటీసీ గొట్టిపర్తి జయమ్మబాలరాజును గ్రామ పంచాయతీ పాలకవర్గం ఘనంగా శాలువతో సన్మానించింది. తుర్కపల్లి మండలంలోని ధర్మారం, వెల్పుపల్లి, నాగాయిపల్లి గ్రామాల్లో జరిగిన పల్లెప్రగతి గ్రామసభలో ఎంపీపీ సుశీల పాల్గొని చెత్తబుట్టలను పంపిణీ చేశారు.

VIDEOS

logo