గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 13, 2020 , 00:21:38

వివేకానందుడి అడుగుజాడల్లో నడువాలి

వివేకానందుడి అడుగుజాడల్లో నడువాలిభువనగిరి, నమస్తే తెలంగాణ : నేటి యువత స్వామి వివేకానందుడి అడుగుజాడల్లో నడువాలని యువజన సంఘాల సమితి జిల్లా కార్యదర్శి దాసరి శ్రీనివాస్‌, స్వామి వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు గుమ్మడి శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం స్వామి వివేకానంద 158వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా భువనగిరి పట్టణం రాయగిరి గ్రామ సమీపంలోని సహృదయ అనాథ వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో యువజన సంఘం సభ్యులు  ఈదులకంటి కరుణాకర్‌గౌడ్‌, చామా నాగేందర్‌, బెజ్జెంకి రామకృష్ణారెడ్డి, పెద్దగాని శ్రీనివాస్‌గౌడ్‌, ఆశ్రమ కోఆర్డినేటర్‌ నజీర్‌ పాల్గొన్నారు.

ఎంఆర్‌సీ భవనంలో..

వలిగొండ : మండల కేంద్రంలోని ఎంఆర్‌సీ భవనంలో స్వామి వివేకానంద జయంతిని నిర్వహించారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు ఉక్కుర్తి లక్ష్మణ్‌, తపస్‌ జిల్లా మాజీ అధ్యక్షులు బందారపు లింగస్వామి, జూల నవీన్‌, కీసర్ల సత్తయ్య, ప్రవీణ్‌, రమేశ్‌, బాలశంకర్‌, ఉపేందర్‌, బీజేపీ నాయకులు దంతూరి సత్తయ్య పాల్గొన్నారు.

బీబీనగర్‌ మండల కేంద్రంలో..

బీబీనగర్‌: మండల వ్యాప్తంగా వివేకానందుడి జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. బీబీనగర్‌ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో సర్పంచ్‌ మల్లగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వివేకానందుడి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అలాగే టీఆర్‌ఎస్‌ మండల కార్యాలయంలో రైతు సమన్వయ సమితి బొక్క జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో వివేకానుందడి జయంతిని నిర్వహించారు. కార్యక్రమాల్లో వైస్‌ ఎంపీపీ వాకిటి గణేశ్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ దస్తగిరి, వార్డు సభ్యులు పంజాల సురేశ్‌గౌడ్‌, రొడ్డ యమున, నెల్లుట్ల ప్రశాంతి, పొట్ట సరిత, బెండ ప్రవీన్‌, మంగ లత, పొట్ట అంజి, సామల వేణు, టంటం రఘు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నూలి విజయమనోహర్‌రావు, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి చింతల సుదర్శన్‌రెడ్డి, యువజన, మహిళా, పట్టణ విభాగం మండల అధ్యక్షులు ఎలుగుల నరేందర్‌, పిట్టల శ్యామలాశ్రీనివాస్‌, కట్ట బాలమణి, నాయకులు కొలను దేవేందర్‌రెడ్డి, జక్కి నగేశ్‌, మంగ అశోక్‌, బద్దం మాధవరెడ్డి, కడెం జంగయ్య, నరేశ్‌యాదవ్‌, గణేశ్‌, సాత్విక్‌ తదితరులు పాల్గొన్నారు.

పోచంపల్లి పట్టణంలో..

భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లి పట్టణంలో వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ పాక వెంకటేశం యాదవ్‌, మాజీ ఎంపీపీ సార సరస్వతీబాలయ్యగౌడ్‌, సంఘం అధ్యక్షుడు చేరాల నర్సింహ, ప్రతినిధులు గుణిగంటి మల్లేశంగౌడ్‌, భోగ రఘు, కిష్టోజు బ్రహ్మచారి, అంకం మురళి, యాదగిరి, అంజయ్య, సంగెం చంద్రయ్య, నర్సింహగౌడ్‌, బొడిగె సాయి పాల్గొన్నారు.

అభినవ యూత్‌ ఆధ్వర్యంలో ..

అభినవ యూత్‌ ఆధ్వర్యంలో చేనేత సహకార సంఘం ఎదుట వివేకానంద జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు పవన్‌కుమార్‌, సాయికుమార్‌, వర్కాల గణేశ్‌, జోగు రవీందర్‌, లింగస్వామి, మహేశ్వరం ప్రసాద్‌, వల్లాల బాల్‌రాజు, గంజి నర్సింహ, వేముల నరేశ్‌, బాలకృష్ణ పాల్గొన్నారు.

VIDEOS

logo