సోమవారం 19 అక్టోబర్ 2020
Yadadri - Jan 12, 2020 , 04:37:25

యాదాద్రిలో ముగిసిన అధ్యయనోత్సవాలు

యాదాద్రిలో ముగిసిన అధ్యయనోత్సవాలు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి అధ్యయనోత్సవాలు శనివారం ముగిశాయి. శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని అలంకరించి బాలాలయంలో ఊరేగించారు.

  • ఉత్సవమూర్తులకు అభిషేకం.. శ్రీవారి ఖజానాకు రూ.8,38,677 ఆదాయం

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి అధ్యయనోత్సవాలు శనివారం ముగిశాయి. శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని అలంకరించి బాలాలయంలో ఊరేగించారు. వారం రోజులుగా జరగుతున్న అధ్యయనోత్సవాలు నేటితో ముగిశాయి. ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో తిరువీధులన్నీ కిటకిటలాడాయి. కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు నారసింహుడిని దర్శించాలని గంటల కొద్దీ క్యూ కట్టారు. శ్రీలక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనానికి బారులు తీరిన భక్తులతో సముదాయాలు. శ్రీసత్యనారాయణస్వామి వారి వ్రతపూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉద యం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేధనలు అర్పించారు. శ్రీ సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే శ్రీసత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు.  సామూహిక వ్రతాలు పెద్ద ఎత్తున జరిగాయి. శ్రీసత్యనారాయణుడిని ఆరాధిస్తూ భక్తి శ్రద్ధ్దలతో పూజలు నిర్వహించారు. 

శ్రీవారి ఖజానాకు రూ.8, 38, 677 ఆదాయం..

   శ్రీవారి ఖజానాకు రూ.8, 38, 677 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ.62, 316,150 రూపాయల టిక్కెట్‌తో రూ.27, 000, కల్యాణకట్ట ద్వారా రూ.18, 000, వ్రత పూజల ద్వారా రూ.40, 000, ప్రసాద విక్రయాలతో రూ.3,95,453,శాశ్వత పూజల ద్వారా రూ.10,116తో పాటు మిగతా అన్ని విభాగాల నుంచి శ్రీవారి ఖజానాకు రూ.8,38,677 ఆదా యం సమకూరినట్లు తెలిపారు.


logo