గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 12, 2020 , 00:25:36

కమ్యూనిటీ భవన నిర్మాణాలలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

కమ్యూనిటీ భవన నిర్మాణాలలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

తుర్కపల్లి :  కమ్యూనిటీ భవన నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి అన్నారు. మండంలోని వాసాలమర్రి ,కొనాపూర్‌, జైతిరాంతండా, మాదాపూర్‌ గ్రామాల్లో ఎమ్మెల్సీ నిధుల నుంచి నిర్మిస్తున్న కమ్యూనిటీ భవనాలను ఆయన శనివారం పరిశీలించారు. భవన నిర్మాణాలకు నిధులను కేటాయించి ఏండ్లు గడుస్తున్నా అధికారుల నిర్లక్ష్యంతో నిర్మాణా పనులు నత్తనడకన నడుస్తున్నాయన్నారు. కొనాపూర్‌ గ్రామంలో కమ్యూనిటీ భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని సంబంధిత ఏఈని ఫోన్‌ ద్వారా నిలదిశారు.ఒక్క వాసాలమర్రి భవన నిర్మాణం మాత్రం పూర్తయిందని మిగిలిన 3చోట్ల భవన నిర్మాణాలను పూర్తి నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు కాంట్రాక్టర్‌లకు సూచించారు. వాసాలమర్రి గ్రామంలోని కమ్యూనిటీ భవన ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యురాలు పలుగుల ఉమారాణి నవీన్‌కుమార్‌, మాజీ ఎంపీపీ బోరెడ్డి రాంరెడ్డి, సర్పంచ్‌ పోగుల ఆంజనేయులు, నాయకులు దుర్వాసులు, మురళి, చంద్రం తదితరులున్నారు.

VIDEOS

logo