కలెక్టర్ అనితారామచంద్రన్, జిల్లా అధికారులకు డెమోక్రసీ అవార్డులు

భువనగిరి, నమస్తే తెలంగాణ : గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యుత్తమ సేవలందించినందుకు కలెక్టర్ అనితారామచంద్రన్, జిల్లా స్థాయి అధికారులకు డెమోక్రసీ అవార్డులు లభించాయి. హైదరాబాద్‌లోని తారామతి బారాదరి ఆడిటోరియంలో శనివారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ అవార్డులను ప్రదానం చేశారు. అవార్డులు అందుకున్న వారిలో కలెక్టర్‌తోపాటు జడ్పీ సీఈవో సీహెచ్ కృష్ణారెడ్డి, డీపీ వో భిక్షం, మదన్‌కుమార్, ఎంపీడీవో నాగిరెడ్డి, రూరల్ ఎస్సై రాఘవేందర్‌గౌడ్, మహ్మ ద్ అత్తర్ ఫర్వేజ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనితారామచంద్రన్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా యం త్రాంగం పూర్తి సహకారాలు అందించారని, అన్ని శాఖల అధికారుల తోడ్పాటుతోనే జిల్లా లో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించగలిగామన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న ఎన్నికలను సైతం మరింత సమర్ద్ధవంతంగా నిర్వహిస్తామన్నారు. జిల్లాకు డెమోక్రసీ అవార్డు లు రావడం, గవర్నర్ చేతు మీదుగా అందుకోవడం సంతోషంగా ఉందన్నారు.
తాజావార్తలు
- ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్
- కారు ఢీకొని బాలుడు మృతి
- కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా అరుణాచల్‌ప్రదేశ్
- కొవిడ్ ఎఫెక్ట్.. మాల్స్, లోకల్ ట్రైన్స్‌పై ఆంక్షలు!
- ఆ గవర్నర్ నన్ను కూడా లైంగికంగా వేధించారు!
- హైదరాబాద్‌లో నడిరోడ్డుపై నాగుపాము కలకలం..!
- ట్విట్టర్ సీఈఓపై కంగనా ఆసక్తికర ట్వీట్
- కేంద్రం ఐటీఐఆర్‌ను రద్దు చేయకపోయుంటే..
- 89 పోస్టులతో యూపీఎస్సీ నోటిఫికేషన్
- మర్యాద రామన్న..కృష్ణయ్యగా మారాడు..!