రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఉంటాం

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి పునర్నిర్మాణంలో భాగంగా జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో ఇండ్లు కోల్పోయిన బాధితులకు అండగా ఉంటామని టీఆర్ఎస్ రైతు విభాగం గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 1వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా 1వ వార్డులో ఇంటింటికీ తిరిగి కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. రూ.2వేల కోట్లతో యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారని, ఈ క్రమంలో రోడ్డు విస్తరణ జరుగుతున్నదని, రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి 1వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి గొర్ల పద్మభాస్కర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మున్సిపల్ చైర్మన్‌గా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్క ఓటరూ విజ్ఞతతో ఆలోచించాలని తెలిపారు. యాదాద్రి అభివృద్ధితోనే ఇక్కడి ప్రాంత భూములను రెక్కలొచ్చాయని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పిన మాటలు నమ్మి మోసపొవద్దని తెలిపారు. టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, యువజన విభాగం నియోజకవర్గ కన్వీనర్ గడ్డమీది రవీందర్‌గౌడ్, 1వ వార్డు అభ్యర్థి గోర్ల పద్మభాస్కర్, తంగళపల్లి సుగుణాకర్, కాటేకర్ పవన్, చంద్రగిరి శ్రీనివాస్, లఖాన్, పాండవుల భాస్కర్‌గౌడ్, చొల్లేరు సర్పంచ్ తోటకూరి బీరయ్య, ఆరె మల్లేశ్‌గౌడ్ పాల్గొన్నారు.