శ్రీమార్కండేయస్వామి బ్రహ్మోత్సవాల వాల్‌పోస్టర్ ఆవిష్కరణ

భూదాన్‌పోచంపల్లి: మండల కేంద్రంలోని శ్రీమార్కండేయస్వామి దేవాలయం 43వ వార్షిక బ్రహ్మోత్సవాల వాల్‌పోస్టర్‌ను శనివారం దేవాలయ ప్రాంగణంలో దేవాలయ చైర్మన్ కవేరు రాములు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పద్మశాలీల కులదైవం అయిన మార్కండేయస్వామి దేవాయం బ్రహ్మోత్సవాలకు ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి పెద్దఎత్తున భక్తులు హాజరు కానున్నందున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జనవరి 27న మార్కండేయస్వామి జయంతి కార్యక్రమంతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 1న లక్ష గాయత్రీ యజ్ఞంతోపాటు శ్రీ భావనారుషి భద్రావతి కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 2న పార్వతీపరమేశ్వరుల కల్యాణోత్సవం, 3న శతఘటాభిషేకం, 4న స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలకు అన్నివర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి భోగ స్వామి, ఉపాధ్యక్షుడు భారత బాలకిషన్, కోశాధికారి ముస్కూరి నర్సింహ, ధర్మకర్తల మండలి సభ్యులు భోగ బాల్‌నర్సింహ, పుప్పాల నాగేశ్వర్, కుడికాల ఎల్లయ్య, కటకం తుకారాం, మిర్యాల వెంకటేశం, చిటిపోలు వసంత, బోడ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
నేడు రాజాపేటలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం
రాజాపేట : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1994-95 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం నిర్వహిం చనున్నట్లు ఆ బ్యాచ్ పూర్వ విద్యార్థి చందు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విద్యార్థులందరూ సకాలంలో హాజరు కావాలని ఆయన కోరారు.
తాజావార్తలు
- ఇక్కడ బంగారం లోన్లపై వడ్డీ చౌక.. ఎంతంటే?!
- విమానంలో కరోనా రోగి.. బయల్దేరే ముందు సిబ్బందికి షాక్!
- టీఆర్ఎస్ ఎన్నారై ప్రజాప్రతినిధులతో రేపు ఎమ్మెల్సీ కవిత సమావేశం
- పెట్రోల్‌పై పన్నుల్లో రాష్ట్రాలకూ ఆదాయం: కేంద్ర ఆర్థికమంత్రి
- టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన ఆర్‌యూపీపీ, ఎస్‌ఎల్‌టీఏ సంఘాలు
- పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం
- అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన వాహనం యజమాని మృతి
- ఎవరీ పద్మశ్రీ.. దిల్ రాజు ఎక్కడినుంచి పట్టుకొచ్చాడు..?
- రూ.43వేల దిగువకు బంగారం ధర..
- ఆయుష్మాన్ 'డ్రీమ్ గర్ల్' తెలుగు రీమేక్‌కు రెడీ