గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 12, 2020 , 00:18:54

పంతంగి ‘టోల్‌' వద్ద వాహనాల క్యూ

పంతంగి ‘టోల్‌' వద్ద వాహనాల క్యూ

చౌటుప్పల్‌ రూరల్‌ : చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద శనివారం వాహనాలు రద్దీ భారీగా నెలకొంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు ఒక్కసారిగా ప్రజలు  బయలుదేరడంతో తెల్లవారుజామున ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీనికితోడు  టోల్‌ప్లాజా వద్ద 2 కిలోమిటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఉద్యోగులకు, విద్యార్థులకు వారాంతపు సెలవులు రావడంతో పండుగకు మూడురోజుల ముందుగానే ప్రజలు సొంతూర్లకు ప్రయాణమయ్యారు. నిరుడు డిసెంబర్‌ నుంచి ఫాస్టాగ్‌ విధానం అమలులోకి రావడంతో సాధారణ రోజుల్లో ఇరువైవులా ఒక్కో నగదు చెల్లింపు కౌంటరు మాత్రమే తెరిచారు. పండుగ నేపథ్యంలో విజయవాడ వైవు 5 ఫాస్టాగ్‌, 4 నగదు చెల్లింపు కౌంటర్లు తెరిచారు. ఈక్రమంలో వాహనాదారులు గందరగోళానాకి గురయ్యారు. ఈ క్రమంలో నగదు చెల్లింపు వాహనాదారులు ఫాస్టాగ్‌ కౌంటర్ల వద్దకు వెళ్లారు. దీం తో వాహనాలు టోల్‌ దాటడానికి అధిక సమయం పట్టింది. ఫలితంగా వాహనాలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున నిలిచాయి. చౌటుప్పల్‌ పోలీసు, టోల్‌, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ట్రాఫిక్‌ను క్రమమబద్ధీకరించారు. ఇందుకోసం వాహనాల వద్దే టోల్‌ సిబ్బం ది నగదు రసీదు ఇచ్చి వాహనాలను పం పించారు. దీంతో ఉదయం 10 తర్వాత రద్దీ ఏర్పడింది. సాధారణ రోజుల్లో ఈ జాతీయ రహదారిపై 25 నుంచి 30 వేల వాహనాలు వెళుతుంటాయి. కానీ ఈరోజు 10 వేల వాహనాలు అధికంగా వెళ్లిన్నట్లు అధికారులు అంచనా వేశారు. టోల్‌ప్లాజాను డీసీపీలు నారాయణరెడ్డి, దివ్యచరణ్‌, ఎసీపీలు సత్తయ్య, శంకర్‌, సీఐలు వెంకటేశ్వర్లు సందర్శించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కాగా హైదరాబాద్‌ వైవు 7 టోల్‌బూతులను తెరవగా.. ఒకటి మాత్ర మే నగదు చెల్లింపు కౌంటరుకు కేటాయించడంతో కొంత మేరకు ట్రాఫిక్‌ నిలిచింది.

VIDEOS

logo