ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 12, 2020 , 00:18:05

అన్ని బల్దియాల్లో గులాబీ జెండా ఎగురాలి

అన్ని బల్దియాల్లో గులాబీ జెండా ఎగురాలి
  • -జిల్లా ప్రతినిధులకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దిశానిర్దేశం

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకునేందుకు జిల్లాలోని ప్రతి ఒక్క కార్యకర్తను ఉపయోగించుకుని కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని టీఆర్‌ఎస్‌ వర్కిం గ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచించారు. పురపాలక సంఘాల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన జిల్లాలోని ఎమ్మెల్యేలకు శనివారం దిశానిర్ధేశం చేశారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి తదితరులు కేటీఆర్‌తో జరిగిన భేటీలో పాల్గొన్నారు. అన్ని పట్టణాల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని కేటీఆర్‌ వారికి సూచించారు. ప్రతి ఇంటికీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెళ్లి ప్రచారం నిర్వహించాలన్నారు. పార్టీ ప్రచా ర సామాగ్రి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

పది రోజులు అహర్నిషలూ కష్టించి పనిచేస్తే విజయం సులువవుతుందని చెప్పారు. వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయని సూచించారు. మున్సిపాలిటీలను ఆనుకుని ఉండే గ్రామాల్లోని కార్యకర్తలను పిలుపించుకుని ప్రచారంలో ఉపయోగించుకుంటే మంచిదని కేటీఆర్‌ గుర్తు చేశారు. కార్యకర్తల బంధువులు, ఇతర కుటుంబసభ్యులు కూడా ప్రచారంలో పాలుపంచుకునేలా చూడాలని చెప్పారు. రెబల్స్‌ బెడద లేకుండా చూసుకోవాలన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన యాదగిరిగుట్ట, భువనగిరిలాంటి మున్సిపాలిటీల్లో జరిగే ప్రచారం ఇతర మున్సిపాలిటీలపై ప్రభావం చూపుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట, ఆలేరు మున్సిపాలిటీల్లో విజయం సాధిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. యాదాద్రి అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషిని యాదాద్రి ఓటర్లకు నివేదించి మంచి ఫలితం పొందుతామని చెప్పారు.

VIDEOS

logo