అందంగా పల్లెలు

-కొనసాగుతున్న రెండో విడుత పల్లె ప్రణాళిక
-అధికారుల క్షేత్ర స్థాయి పర్యటనలతో సత్ఫలితాలు
-గ్రామాల్లో ఊపందుకున్న అభివృద్ధి పనులు
భూదాన్‌పోచంపల్లి: ప్రతి గ్రామాన్ని అందంగా మార్చుకోవాలని డీపీవో వనం జగదీశ్వర్ అన్నారు. బుధవారం భూదాన్‌పోచంపల్లి మండల పరిధిలోని జూలూరు, జాలాల్పూర్ గ్రామాల్లో నిర్వహించిన పల్లెప్రగతిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూలూరు, జలాల్పూర్లో వన నర్సరీలను సందర్శించి అధికారులకు తగు సూచనలు చేశారు. గౌస్‌కొండ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి పాల్గొని నూతనంగా కొనుగోలు చేసిన ట్రాక్టర్‌ను ప్రారంభించారు. సాయినగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో జెడ్పీటీసీ కోట పుష్పలతామల్లారెడ్డి పాల్గొని నూతనంగా నిర్మిస్తున్న అంతర్గత మురుగునీటి కాల్వ పనులను పరిశీలించారు. అనంతరం ఎంపీపీ ప్రభాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశం యాదవ్‌తో కలిసి చెత్తబుట్టలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీవో జనార్దన్‌రెడ్డి, ఏపీవో కృష్ణమూర్తి , చంద్రహౌళి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు లావణ్య, రాములు, శోభ, రేణుక, రజిత పాల్గొన్నారు.
ప్రగతి పనుల పరిశీలన..
భువనగిరి, నమస్తే తెలంగాణ : మండలంలోని వడాయిగూడెం, ఎర్రంబల్లిలో జరుగుతన్న పల్లెప్రగతి పనులను డీఆర్డీవో ఉపేందర్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. ఆయన వెంట ఎంపీపీ నరాల నిర్మల, జడ్పీటీసీ బీరుమల్లయ్య, పీఏసీఎస్ చైర్మెన్ సత్తిరెడ్డి, ఎంపీడీవో నాగిరెడ్డి తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- నిర్మల్ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
- హాట్ టాపిక్‌గా వైష్ణవ్‌తేజ్ 3 సినిమాల రెమ్యునరేషన్
- బస్సులను అపడం లేదు.. కానీ నెగటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి
- రైలు పట్టాలపై ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న రైల్వే పోలీసులు ..వీడియో
- అతివేగం ఖరీదు : బెంజ్ కారు నడుపుతూ వ్యక్తిని బలిగొన్న టీనేజర్!
- నీరవ్ కోసం ఆర్థర్ జైలులో ఏర్పాట్లు
- భారత్‌తో చర్చలకు సిద్ధం : ఇమ్రాన్ ఖాన్
- సీటెట్ ఫలితాల విడుదల
- అందాల యాంకరమ్మకు అంతా ఫిదా..!
- మృతదేహానికీ ఉరిశిక్ష అమలు.. ఇరాన్లో ఇచ్ఛంత్రం..!