e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home జిల్లాలు వానొచ్చె...వరదొచ్చె..

వానొచ్చె…వరదొచ్చె..

వానొచ్చె...వరదొచ్చె..

అలుగు పోస్తున్న చెరువులు, చెక్‌డ్యాంలు
గంగమ్మతల్లికి రైతుల ప్రత్యేక పూజలు
ఆత్మకూర్‌(ఎం)లో 78.6 మి.మీ. వర్షపాతం నమోదు

మోటకొండూర్‌, జూలై17: సీఎం కేసీఆర్‌ చొరవతోనే చెరువుల అభివృద్ధి సాధ్యమైందని మోటకొండూర్‌ సర్పం చ్‌ వడ్డెబోయిన శ్రీలత అన్నారు. ఇటీవల కురిసిన వర్షాల తో పూర్తిగా జలమయమైన మండల కేంద్రంలోని ఊరచెరువును శనివారం ఆమె పరిశీలించి మాట్లాడారు. గతం లో ఊరచెరువు పునరుద్ధరణ పనులు, కట్టు కాల్వ పనులను మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, గుండకండ్ల జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సహకారంతో చేపట్టడంతోనే చెరువులో జలకళ సంతరించుకున్నదన్నారు. సీఎం కేసీఆర్‌ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకం సత్ఫలితాలను ఇస్తున్నదన్నారు. పూడిక తీయడం, తెగిపోయిన కట్టను సరిచేయ డం వంటి పనులతోనే ఊర చెరువు త్వరగా వర్షపు నీటితో నిండిందన్నారు. చెరువు పూర్తిగా నిండడంతో రైతులు, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. చెరువు కట్ట వద్ద ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ప్రమాద సూచికలను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ రేగు శ్రీనివాస్‌, వార్డు సభ్యురాలు జంపాల సత్తమ్మ, గ్రామస్తులు కొరటికంటి విజయ్‌చందర్‌, వంగపల్లి మహేందర్‌, వంగపల్లి చిరంజీవి, ప్రతికంఠం గౌతమ్‌రాజ్‌, బోట్ల ప్రశాంత్‌, రమేశ్‌, నవీన్‌ పాల్గొన్నారు.
గంగమ్మ తల్లికి పూజలు
ఆత్మకూరు(ఎం), జూలై17: మండల కేంద్రంలోని రజకు లకు సంబంధించిన వ్యవసాయ బావుల వద్ద ఉన్న బిక్కే రు వాగు కురిసిన వర్షాలతో ప్రవహిస్తుండడంతో శనివా రం రైతులు గంగమ్మతల్లికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సత్యనారాయణ, మురళి, వెంకటేశ్‌, ఉప్పలయ్య, రామస్వామి సత్తయ్య, యాదయ్య, మొగులయ్య, ప్రశాంత్‌, నరేశ్‌, మహేశ్‌ పాల్గొన్నారు.

జిల్లాలో మోస్తరు వర్షం
ఆత్మకూర్‌ (ఎం) మండలంలోఅత్యధిక వర్షపాతం నమోదు
భువనగిరి అర్బన్‌, జూలై 17: జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఓ మోస్తరు వర్షం కురిసింది. ఆత్మకూర్‌ (ఎం) మండలంలో 78.6 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదుకాగా భువనగిరి మండలంలో 0.8మి.మీ అత్యల్ప వర్షపాతం నమోదైంది. యాదగిరిగుట్ట మండలంలో 17.2 మి.మీ, బీబీనగర్‌ మండలంలో 1.6 మి.మీ, చౌటుప్పల్‌ మండలంలో 2.8మి.మీ, రామన్నపేట మండలంలో 6.6మి.మీ, వలిగొండలో 42.8 మి.మీ, మోత్కూర్‌లో 32.4 మి.మీ, గుండాలలో 31.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

- Advertisement -

చెరువులకు జలకళ
చౌటుప్పల్‌, జూలై17: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని చెరువులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే తం గడపల్లి, లక్కారం, చౌటుప్పల్‌లోని చెరువుల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్నది. మరో భారీ వర్షం కురిస్తే చెరువులన్నీ నిండే అవకాశం ఉంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వానొచ్చె...వరదొచ్చె..
వానొచ్చె...వరదొచ్చె..
వానొచ్చె...వరదొచ్చె..

ట్రెండింగ్‌

Advertisement