e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home యాదాద్రి ఆకు కూరలతో ఆరోగ్యం

ఆకు కూరలతో ఆరోగ్యం

ఆకు కూరలతో ఆరోగ్యం
  • పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
  • అంగన్‌వాడీ కేంద్రాల్లో తోటల పెంపకం
  • అన్ని కేంద్రాలకు విత్తనాల సరఫరా

ఆలేరు టౌన్‌, జూలై 14 : పోషకాహారం అంటే ఎంత మేరకు ఏం తీసుకుంటున్నారన్నది కాదు. శరీరానికి ఏ స్థాయిలో పోష కాలు అందుతున్నాయన్నది ముఖ్యం. ఆరోగ్యంగా ఉండాలం టే పోషకాహారం తీసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా గర్భిణు లు, బాలింతలు, చిన్నారులకు పోషక విలువలతో కూడిన ఆ హారం ఎంతో అవసరం. ఇందుకుగాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా లు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. పోషకాహారం ఎంతో అవసరమన్నది నిపుణుల సూచన. గత ఏడాది నుంచి అంగన్‌ వాడీ కేంద్రాల్లోని పెరటితోటల్లో ఆకు కూరలు, కూరగాయలు పెంచుతున్నారు. పాలకూర, బచ్చలకూర, మెంతికూర, టమా ట, బెండ, చిక్కుడు తదితర వాటిని పెంచుతున్నారు. జిల్లాలో నాలుగు ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల కింద జిల్లాలో 901 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో గర్భి ణులు 5954, బాలింతలు 6049, చిన్నారులు 21,700 మం ది ఉన్నారు. అయితే వీరికి సరైన పోషకాహారం అందించేందు కు ఈ ఏడాది 7 రకాల విత్తనాలు సోరకాయ, వంకాయ, తెల్ల బొబ్బెర్లు, బెండకాయ, బీన్స్‌, బీరకాయ, టమాటా విత్తనాలు సరఫరా చేశారు.

పెరటి తోటలు ఏర్పాటు చేసి వివిధ రకాల ఆకు కూరలు పెంచుతున్నారు. పోషన్‌ అభియాన్‌లో భాగంగా విత్తనాలను సరఫరా చేశారు. ప్రతి సెంటర్‌లో పెరటితోటలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సేంద్రి య పద్ధతిలో పెంచాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి అంగన్‌వాడీ టీచర్లకు అవగాహన కల్పించారు. ఒకవేళ స్థలం లేకపోతే ఆయా కేంద్రాల్లోని కుండీలు, బకెట్లు, తొట్లు, పగిలి పోయిన ప్లాస్టిక్‌ బిందెలు వంటి వాటిలో పెంచాలని సూచిం చారు. ఇవేకాకుండా మెంతికూర, కరివేపాకు, సుక్కకూర, పాలకూర, తోటకూర, కొత్తిమీర, బొప్పాయి వంటి మొక్కలు పెంచాల్సి ఉంటుంది. వీటితో పాటు కాలాల్లో కాతనిచ్చే మొక్క లు పెంచి వాటికి పందిర్లు వేసి పరిరక్షించాలి. ఇలా తాజా ఆకు కూరలతో వారికి వండి పెడితే సరైన పోషకాలు అందుతాయని స్త్రీశిశు సంక్షేమ శాఖ ఉద్దేశం. పోషకాహారం లోపం నివారించి ఆరోగ్య తెలంగాణను నిర్మించాలన్నది ప్రభుత్వ సంకల్పం.

- Advertisement -

పోషకాహారం లోపిస్తే…
ఎలాంటి రోగాల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవ డం చాలా ముఖ్యం. అంతే కాకుండా కరోనా వైరస్‌ను తరిమి కొట్టాలంటే పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలి. పోషకాల లోపంతో రక్తహీనత, బరువు తక్కువ ఉండటం, పె రుగుదల లేకపోవడం, అధిక బరువు ఉండడం, మంద బుద్ధి తదితర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. రోగ నిరోధక శక్తి తగ్గుతున్నది. దీంతో అనేక రకాల వ్యాధులకు గురవుతారు. వ్యాధులు వచ్చాక చికిత్స తీసుకోవడం కంటే వ్యాధులు రా కుండా బలవర్థకమైన ఆహారం తీసుకోవాలి. అంతే కాకుండా అనేక చోట్ల జంక్‌ఫుడ్‌, వేపుళ్లు ఎక్కువ తినడం వల్ల బరువు ఎ క్కువ ఉంటున్నా, వారికి సరైన పోషకా లు అందడం లేదు.

పోషకాహారంతో ప్రయోజనాలు ..
పోషకాహారం తీసుకోవడం వల్ల మాన సిక ఎదుగుదలతో పాటు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతున్నది. మంద బుద్ధి, మృత శిశువుల జననం, పిల్ల ల మరణాలు, పురిటి మరణాలను నివారించవచ్చు. పిల్లల్లో ఏకాగ్రత ఉండడంతో పాటు ఉల్లాసంగా ఉంటారు. చిన్నారు లకు తల్లి పాలతో పాటు ఇచ్చే ఆహారాన్ని అదనపు ఆహారం అంటారు. చిన్నారుల్లో ఎదుగుదలకు అధిక పోషకాలు అవస రం. చిన్నారులు ఎదిగే కొద్ది శిశువుకు ఇచ్చే ఆహారం మెత్తగా, సులభంగా తినేలా ఉండాలి. బియ్యం, గో ధుమలు, జొన్నలు, సజ్జలు లాంటి ధాన్యాలు, పెసర, శనగ, పుట్నాలు తదితర ప ప్పుదినుసులు, వేరు శనగ, నువ్వులు, బెల్లం, చక్కెర తదితరా లతో అదనపు ఆహార పదార్థాలను తయారు చేసి అందించవ చ్చు. అయితే వీటిని తక్కువ ఖర్చుతో కూడా అందించవచ్చు. దీంతో పాటు కాలానుగుణంగా వచ్చే పండ్లను తీసుకోవాలి. రోజూ గుడ్డు తీసుకుంటే మంచిది.

తాజా ఆకు కూరలతో ఆరోగ్యం
గర్భిణులు, బాలింతలు, చి న్నారులకు తాజా ఆకు కూర లతో వండి పెట్టడం వల్ల వా రికి సమతుల ఆహారం అం దుతుంది. పోష్టికాహారంతో రోగనిరోధక శక్తి పెరుగుతుం ది. అన్ని అంగన్‌వాడీ కేంద్రా ల్లో పెరటి తోటలు పెంచాలి. ఈ ఏడాది మొక్కలు నాటేందుకు అవసరమైన విత్తనాలు ప్రభుత్వం అందిస్తున్నది. పోషకాలతో కూడిన ఆహారాన్ని తీ సుకోవాలి. బయట లభించే ఆహార పదార్థాలను తీసుకోవ ద్దు. ఇంట్లోనే మంచి ఆహారం తీసుకోవాలి. చిరు ధాన్యాలు, తృణధాన్యాలు తదితర వాటితో తయారు చేసినవి తినాలి. ఆకుకూరలు, పచ్చి కూరగాయలు, అంబలి వంటివాటిని తీ సుకుంటే మంచిది. కృష్ణవేణి, డీడబ్ల్యూవో

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆకు కూరలతో ఆరోగ్యం
ఆకు కూరలతో ఆరోగ్యం
ఆకు కూరలతో ఆరోగ్యం

ట్రెండింగ్‌

Advertisement