వెయ్యేండ్ల యాదాద్రి

ఆగమ శాస్ర్తోక్తంగా ఆలయ నిర్మాణ పనులు
ఆరు గంటల పాటు పరిశీలించిన సీఎం కేసీఆర్
ఆలయ స్థపతులు, ఆర్కిటెక్ట్ అధికారులకు సూచనలు
హరిత హోటల్లో అధికారులతో సమీక్ష
టెంపుల్ సిటీలో సుమారు 200 ఎకరాల్లో 365 కాటేజీలు..
నాలుగు వేల మందికి ఒకేసారి సత్యనారాయణ వ్రతం..
5 వేల కార్లు, 10 వేల బైకులను నిలిపేలా పార్కింగ్
మూడు వారాల్లో రూ.75 కోట్లు విడుదల చేయాలని ఆదేశాలు
అణువణువునా ఆధ్యాత్మికతతో... అడుగడుగునా అత్యద్భుతంగా పునర్నిర్మితమవుతున్న యాదాద్రి ఆలయ పనులను ఆదివారం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు పరిశీలించారు. మధ్యాహ్నం 12.20కి కొండపైకి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ఆలయ ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహచార్యులు పూర్ణకుంభ స్వాగతం పలికి చతుర్వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం బాలాలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం.. ఆలయం మొత్తం కలియతిరిగారు. బాహ్య, అంతః ప్రాకారాలు, విగ్రహాలు, సాలహారాలు... ఇలా అన్నింటినీ పరిశీలిస్తూ ఆలయ స్థపతులు, ఆర్కిటెక్ట్ అధికారులకు పలు సూచనలు చేశారు. సంప్రదాయ, ఆగమ శాస్త్ర నియమాలు పాటిస్తూ ఆలయ పునర్నిర్మాణ పనులను జరగాలని... ఆలయం ఆసాంతం బంగారం, వెండి ధగధగలతో మెరవాలని.. వెయ్యేండ్ల పాటు నిలిచేలా యాదాద్రి నిర్మాణం ఉండాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. నూతన లైటింగ్ విధానాన్ని ప్రొజెక్టర్ ద్వారా వీక్షించిన ఆయన సుమారు 6 గంటల పాటు ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆపై అధికారులతో సమీక్ష నిర్వహించి టెంపుల్ సిటీలో సుమారు 200 ఎకరాల్లో 365 కాటేజీలను నిర్మించాలని, నాలుగు వేల మంది ఒకేసారి సత్యనారాయణ వ్రతం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 5 వేల కార్లు, 10 వేల బైకులను నిలిపేలా పార్కింగ్ సౌకర్యం కల్పించాలని సూచించారు. పనులు వేగవంతం కావాలని, ఇందుకోసం మూడు వారాల్లో రూ.75 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలిచ్చారు.
తాజావార్తలు
- పాటలు పాడే వేణువు సిద్ధం చేసిన గిరిజనుడు.. వీడియో
- టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు అద్భుత స్పందన : మంత్రి కేటీఆర్
- బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..‘పుష్ప’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్
- డ్రగ్ సిండికేట్‌కు చెక్ : రూ 4 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లు సీజ్!
- ఎస్యూవీ కార్లకు ఫుల్ డిమాండ్: ఫిబ్రవరి సేల్స్ మిక్చర్ పొట్లాం!!
- ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు సర్కోజీకి జైలు శిక్ష
- మహిళ ఫిర్యాదుతో ఆప్ ఎమ్మెల్యేపై వేధింపుల కేసు
- సచిన్ ముందే చూడకుండా రుబిక్ క్యూబ్‌ని సెట్ చేశాడు..వీడియో వైరల్
- ‘4-5 రోజుల తర్వాత మరణిస్తే టీకాతో సంబంధం లేనట్లే..’
- ఝరాసంగం కేజీబీవీలో కరోనా కలకలం