e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home జిల్లాలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంది

ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంది

సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ శేఖర్‌ సి.మాండే
విపత్తుల నియంత్రణకు జియో మాగ్నెటోమీటర్‌
అరుదైన పరిశోధనకు వేదికైన మందోళ్లగూడెం
నూతన జియో మాగ్నెటోమీటర్‌ అబ్జర్వేటరీ ప్రారంభం
దేశంలో పది… రాష్ట్రంలో ఇదే మొదటిది…

చౌటుప్పల్‌ రూరల్‌, జూలై31: మండలంలోని మందోళ్లగూడెం అరుదైన పరిశోధనకు మరోసారి వేదికైంది. ఇక్కడ సీఎస్‌ఐఆర్‌- ఎన్‌జీఆర్‌ఐ ఆధ్వర్యంలో నెలకొల్పిన భూఅయస్కాంత క్షేత్ర పరిశోధన కేంద్రంలో జియో మాగ్నెటోమీటర్‌ అబ్జర్వేటరీని శనివారం సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ శేఖర్‌ సి.మాండే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అక్కడి నుంచి నూతన అబ్జర్వేటరీకి సంబంధించిన రీడింగ్‌ తీసే గదిని, తర్వాత భూ గర్భ జలాల పెంపునకు శాస్త్రీయంగా క్షేత్ర ప్రాం గణంలో ఏర్పాటు చేసిన కుంటను ఆయన పరిశీలించారు. సమీప రైతులతో మాట్లాడారు. ఈ కుంటలోకి నీరు సమృద్ధిగా చేరితే సమీప గ్రామాల్లోని 1200 ఎకరాల్లో పంటలు సాగవుతాయని రైతులు ఆయనకు వివరించారు. కుంటను మరిం త లోతు తవ్వించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట ఎన్‌జీఆర్‌ఐ డైరెక్టర్‌ తివారీ, శాస్త్రవేతలు నందన్‌, కుషిమిత ఆరోరా, దేవేందర్‌, నగేశ్‌, అజయ్‌, కీర్తి వాస్తవ, టెక్నికల్‌ అధికారి మంజుల, పన్ని చంద్రశేఖర్‌, ఎల్‌ మంజుల, చంద్రశేఖర్‌రావు తదితరులు ఉన్నారు.

ఉపయోగం ఇలా..
అబ్జర్వేటరీలో డెన్మార్క్‌, కెనడా దేశాల్లో తయారైన అత్యాధునిక మాగ్నెటోమీటర్‌ను అమర్చారు. వాటితో భూఅయస్కాంత క్షేత్రాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రతి సెకనుకూ సేకరించి అం దించనుంది. అంతేకాకుండాప్రపంచంలో ఉన్న అబ్జర్వేటరీలకు కూడా ఇక్కడి నుంచి నమూనా సమాచారాన్ని అందించడం.. అక్కడి నుంచి సేకరించడం చేస్తుంది. దీని ద్వారా ప్రపంచంలోని అన్ని అబ్జర్వేటరీల ద్వారా వచ్చే సమాచారంతో శాస్త్రవేతలు భూఅయస్కాంత క్షేత్రాల మార్పును ముందస్తుగా అంచనా వేస్తారు. తద్వారా భూగోళానికి వచ్చే భూకంపాలు, సునామీలను ముందే పసిగట్టి ప్రజల ప్రాణాలు, ఆస్తులు నాశనం కాకుం డా అప్రమత్తం చేసే అవకాశం ఉంటుంది. వీటి సమాచారంతో భూగర్భంలోని ఖనిజాలు, చము రు నిక్షేపాలు, జలవనరులు ఎక్కడెక్కడున్నాయో గుర్తించొచ్చు. ఇలాంటి అబ్జర్వేటరీలు ప్రపంచం లో 450, దేశంలో 10 ఉన్నాయి. మన రాష్ట్రంలో ఇదే మొదటిది. మందోళ్లగూడెం గ్రామంలోని 105 ఎకరాల్లో 1970లో ఈ భూఅయస్కాంత క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు.

- Advertisement -

విపత్తుల నియంత్రణకు జియో మాగ్నెటోమీటర్‌ దోహదం
విపత్తుల నియంత్రణకు జియో మాగ్నెటోమీటర్‌ ఎంతో దోహదపడుతుంది. దీంతో భూఅయస్కాంతశక్తి ఎలా మారుతుందో తెలుస్తుంది. ఇతర దేశాల అబ్జర్వేటరీల నుంచి వచ్చే సమాచారాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. రోదసీలో జరిగే ప్రమాదాలను శాస్త్రవేత్తలకు చేరవేస్తుం ది. భూగర్భజలాల పెంపునకు రాష్ట్రంలో శాస్త్రీయ పద్ధ్దతిలో కుంటలను తవ్వించే విషయాన్ని తెలంగాణ గ్రౌండ్‌ వాటర్‌ చీఫ్‌ సెక్రటరీ బోర్డుకు వివరిస్తా.
-డాక్టర్‌ శేఖర్‌ సి.మాండే, సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana