సహకార ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురాలి

బొమ్మలరామారం: సహకార సంఘం ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం బొమ్మలరామారం మండల కేంద్రంలోని ఓం శివ ఫంక్షన్హాల్లో సహకార సంఘం ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ మండల విసృతస్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్దే విజయమన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు సబ్బండ వర్గాలకు అండగా నిలుస్తున్నాయనడంలో సందేహం లేదన్నారు. సహకార ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఎన్నికల్లో పోటీ లేకుండా ఉండాలన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే సహించేదిలేదన్నారు. పార్టీ ఆదేశాలను బేఖాతర్ చేస్తే శాశ్వతంగా బహిష్కరిస్తామన్నారు. బొమ్మలరామారం సింగిల్‌విండో బ్యాంక్‌పై గులాబీ జెండాను ఎగురవేయాలని కోరారు. అభ్యర్థుల ఎంపికకై ముఖ్య నాయకులతో పరిశీలన కమిటీ సభ్యులను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి టీఆర్ఎస్ గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు.
సమావేశంలో ఎంపీపీ చిమ్ముల సుధీర్ రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పొలగౌని వెంకటేశ్‌గౌడ్, సీనియర్ నాయకుడు మర్రి కృష్ణారెడ్డి, గూదె బాల్‌నర్సింహ, కుశంగల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రామిడి రాంరెడ్డి, శ్రీనివాస్ నాయక్, గుండ్లపల్లి వెంకటేశ్‌గౌడ్, కూర వెంకటేశ్ , సతీశ్ గౌడ్, లింగానాయక్, రాజన్ నాయక్, బుడుమ వెంకటేశ్, బాల్సింగ్, మహేశ్ గౌడ్, ఉడుతల రమేశ్‌గౌడ్, పోశంరెడ్డి, ఆంజనేయులు, పొట్ట కృష్ణ, సింగిల్ విండో చైర్మన్ మోకు మధుసూదన్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు మూగల స్వయంప్రభ, యూత్ అధ్యక్షుడు శశిధర్‌రెడ్డి, మచ్చ శ్రీనివాస్‌గౌడ్, మన్నె శ్రీధర్, మల్లారెడ్డి, బాల్‌రాజ్, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు మేడబోయిన గణేశ్, ఉపసర్పంచ్ భరత్, పట్టణాధ్యక్షుడు బెజ్జంకి పాపిరెడ్డి, పలు గ్రామాల కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
రాజాపేటలో..
రాజాపేట: సహకార పోరులో గులాబీ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మీనాక్షీ ఫంక్షన్హాల్లో నిర్వహించిన టీఆర్ఎస్ మండల సర్వసభ్య సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అందిస్తున్న స్వచ్ఛమైన పాలనతో టీఆర్ఎస్కే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా గులాబీ పార్టీ జెండానే ఎగురుతుందన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ కార్యకర్తలు గడపగడపకూ తీసుకెళ్లి సహకార బ్యాంక్ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేయాలన్నారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు డిపాజిట్ గల్లంతవడం ఖాయమన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నాగిర్తి నాగిర్తి రాజిరెడ్డి, టీఆర్ఎస్ మహిళాధ్యక్షురాలు ఎడ్ల బాలలక్ష్మి, ఎంపీపీ గోపగోని బాలమణీయాదగిరిగౌడ్, జడ్పీటీసీ చామకూర గోపాల్‌గౌడ్, ఆలేరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాపోలు లక్ష్మారెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కంచర్ల శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ డైరెక్టర్లు గుర్రం నర్సింహులు, బోళ్ల రాఘవరెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ యువజన మండలాధ్యక్షుడు నక్కిర్త కనకరాజు, నాయకులు కోరుకొప్పుల వెంకటేశ్‌గౌడ్, సందిల భాస్కర్‌గౌడ్, గుంటి కృష్ణ, మేక వెంకటేశ్వర్‌రెడ్డి, గౌటే లక్ష్మణ్, సట్టు తిరుమలేశ్, సామల రమేశ్, ఠాకూర్ ప్రమోద్‌సింగ్, పల్లె సంతోశ్, ఠాకూర్ భగత్‌సింగ్, మోత్కుపలి నవీన్‌కుమార్.
వరుణ్ రమేశ్, గిరిరాజు వెంకటయ్య, బోగ హరినాథ్, మాడిసెట్టి సత్యనారాయణ, బిల్ల శ్రీనివాస్, బెజుగం సంతోశ్‌గుప్తా, మాడోతు రాణి, రాములునాయక్, లక్ష్మణ్‌నాయక్, లక్ష్మారెడ్డి, బుచ్చిరెడ్డి, ముకుందారెడ్డి, బాలనర్సయ్య, సర్పంచ్‌లు ఆడేపు ఈశ్వరమ్మాశ్రీశైలం, గుంటి మధుసూదన్‌రెడ్డి, నాగిర్తి గోపిరెడ్డి, ఠాకూర్ ధర్మేందర్‌సింగ్, బూర్గు భాగ్యమ్మ, గొడుగు రాజు, గాడిపల్లి శ్రవన్, పంబ కరుణాకర్, చిందం నర్సమ్మ, బెజుగం రాజేశ్వర్గుప్తా, ఎంపీటీసీలు జెల్ల భిక్షపతిగౌడ్, రాపోలు కవితాతిరుపతిరెడ్డి, ఎడ్ల నరేశ్‌రెడ్డి, ల్యాగల శ్రీలత, ఎర్రగోకుల రాజు, గజ్జెల రాజు, మోత్కుపల్లి బాలకృష్ణ, కేతమ్మ, సత్తిరెడ్డి పాల్గొన్నారు.
తాజావార్తలు
- బీజేపీలోకి నటుడు మిథున్ చక్రవర్తి?
- ఇన్‌కం టాక్స్ దాడులపై స్పందించిన హీరోయిన్ తాప్సీ
- అశ్విన్, అక్షర్.. వణికిస్తున్న భారత స్పిన్నర్లు
- బీజేపీలో చేరిన బెంగాల్ కీలక నేత దినేశ్ త్రివేది
- హాట్ ఫొటోలతో హీటెక్కిస్తున్న పూనమ్ బజ్వా
- కన్యాకుమారి లోక్‌సభ.. బీజేపీ అభ్యర్థి ఖరారు
- మహేష్ బాబు కొత్త కార్‌వ్యాన్ ఇదే..!
- ఆ ఐదు రాష్ట్రాల్లోనే అత్యధికంగా కొత్త కేసులు
- మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
- కరోనా టీకా తీసుకున్న కేంద్ర మంత్రులు