e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Home యాదాద్రి రైతువేదికలు దేశానికే ఆదర్శం

రైతువేదికలు దేశానికే ఆదర్శం

రైతువేదికలు దేశానికే ఆదర్శం
  • రైతులు సేంద్రియ సాగుపై దృష్టి సారించాలి
  • మాసాయిపేటలో రైతువేదిక, సీసీ కెమెరాలను
  • ప్రారంభించిన ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, సీపీ మహేశ్‌భగవత్‌

యాదగిరిగుట్ట రూరల్‌, జూలై 19 : రాష్ట్రంలో రైతువేదికల నిర్మాణం దేశానికే ఆదర్శమని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం యాదగిరిగుట్ట మండలంలోని మాసాయిపేట గ్రామంలో రైతువేదిక, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, సీసీ కెమెరాలు, ఎస్సీ కమ్యూనిటీ హాల్‌, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని అమలు చేస్తూ రైతును రాజులా చూస్తుందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత సాగు నీటి వసతి, 24 గంటల విద్యుత్‌, రైతుబంధు, రైతుబీమాను ప్రవేశపెట్టి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులను కంటికి రెప్పలా చేసుకుంటుందన్నారు. రైతులు గ్రామంలోని వ్యవసాయ భూమిని పూర్తిగా ఉపయోగించుకోవాలని సూచించారు.

ఆలేరు నియోజకవర్గంలోనే 40 వేల లీటర్లకు పైగా పాల ఉత్పత్తి అవుతున్నాయని, దీంతోపాటుగానే సమానంగా పంటలు పండించాలని చెప్పారు. రైతులు పంటల సాగులో సేంద్రియ సాగును అవలంభించాలని చెప్పారు. వరి, పత్తి, కంది కాకుండా నువ్వులు, పెసర్లు, చిరుధాన్యాలు, జొన్నలు వంటి పంటలు పండించాలని కోరారు. ఆవుల పేడ కూడ చక్కటి ఎరువుగా ఉపయోగపడుతుందన్నారు. రైతులు తమకున్న భూమిలో కొంత మేర ఈ సేంద్రియ సాగుకు కేటాయించాలని సూచించారు. మాసాయిపేట గ్రామం హరితహారంలో కూడా ముందుందని కొనియాడారు. మాసాయిపేట గ్రామస్తులు ఇలాగే ఐక్యంగా ఉంటూ అన్ని రంగాల్లో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని, దీని కోసం తన పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

సీసీ కెమెరాల ఏర్పాటు అభినందనీయం
మాసాయిపేట గ్రామంలో రికార్డు స్థాయిలో రూ.11లక్షల వ్యయంతో 70 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని ప్రభుత్వవిప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి కొనియాడారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 3వేల జనాభా ఉన్న గ్రామంలో ఇంతటి భారీ స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమని, సర్పంచ్‌, పాలకవర్గం, ప్రజలను ప్రత్యేకంగా అభినందించారు. సీసీ కెమెరాల వలన చాలా వరకు నేరాలను నివారించవచ్చన్నారు. నేటి ఆధునిక యుగంలో సీసీ కెమెరాల అవసరం ఉందన్నారు. ఒక గ్రామంలో శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే గ్రామం అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. గ్రామంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరిగినా వాటిని గుర్తించేందుకు కెమెరాలు దోహదపడుతాయన్నారు.

సీసీ కెమెరాలతో కేసుల ఛేదన సులభం: సీపీ
సీసీ కెమెరాల ఏర్పాటు వలన కేసుల ఛేదన సులభతరం అవుతుందని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలు, హత్యలు, గొడవలు, మిస్సింగ్‌ వంటి కేసులతోపాటు అనేక కేసులను ఈ సీసీ కెమెరాల వలన ఛేదించడం సులభతరమన్నారు. ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వలన నేర రహిత గ్రామాలుగా మారుతాయన్నారు. దేశంలో లక్ష జనాభాకు 243 మంది పోలీసులు కావాలని, ప్రస్తుతం 140 మంది పోలీసులు ఉన్నారని చెప్పారు. తెలంగాణలో త్వరలోనే మరో 20వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ అయ్యే ప్రక్రియ నడుస్తుందన్నారు. 70 శాతం కేసులను ఛేదించడంలో ఈ సీసీ కెమెరాలు పోలీసులకు సహాయపడుతున్నాయన్నారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారాలు చాలా సహాయపడుతున్నాయన్నారు. కాబట్టి ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డీసీపీ నారాయణరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌ కమలాకర్‌, ఆలేరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌, ఎంపీపీ చీర శ్రీశైలం, జడ్పీటీసీ తోటకూరి అనురాధ, సర్పంచ్‌ వంటేరు సువర్ణాఇంద్రసేనారెడ్డి, వైస్‌ ఎంపీపీ ననబోలు ప్రసన్నాశ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ కోట్ల నర్సింహ్మారెడ్డి, ఏఆర్‌ ఏసీపీ శ్రీనివాస్‌, యాదగిరిగుట్ట ఇన్‌స్పెక్టర్‌ జానకిరెడ్డి, రూరల్‌ సీఐ నర్సయ్య, ఏడీఏ పద్మావతి, ఎంపీడీవో ప్రభాకర్‌రెడ్డి, ఏవో రాజేశ్‌కుమార్‌, ఏఈవోలు మనీషా, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, ఉపసర్పంచ్‌ అమృత, పాలకవర్గ సభ్యులు ఉస్మాన్‌, విజయ, బాబురావు, పూలమ్మ, ఉపేంద్ర, పద్మ, కళమ్మ, బుచ్చిరెడ్డి, వినోద్‌కుమార్‌, కోఆప్షన్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రైతువేదికలు దేశానికే ఆదర్శం
రైతువేదికలు దేశానికే ఆదర్శం
రైతువేదికలు దేశానికే ఆదర్శం

ట్రెండింగ్‌

Advertisement