e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home యాదాద్రి రైతుల సంఘటితం కోసమే..

రైతుల సంఘటితం కోసమే..

ఆలేరు రూరల్‌, జూలై16: రైతుల సంఘటితం కోసమే ప్రభుత్వం రైతు వేదిక భవనాలను నిర్మిస్తున్నదని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పటేల్‌గూడెం, కొలనుపాక గ్రామాల్లో నిర్మించిన రైతు వేదిక భవనాలను ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, జడ్పీచైర్మన్‌ సందీప్‌రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించి మాట్లాడా రు. రైతు వేదిక భవనాల ఏర్పాటుతో రైతులంతా ఒకే చోట కూర్చుని తమ సమస్యలు చేర్చించుకునేందుకు వీలుంటుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఆలే రు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ మొగులగాని మల్లేశ్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గ్యాదపాక నాగరాజు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్‌, మదర్‌ డెయిరీ డైరెక్టర్లు సోమిరెడ్డి, శ్రీకర్‌రెడ్డి, శ్రీశైలం, పీఏసీఎస్‌ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు మల్లేశ్‌గౌడ్‌, నర్సింహులు, నర్సింహులు, సిద్ధులు, భిక్షపతి, సర్పంచ్‌లు లక్ష్మీప్రసాద్‌రెడ్డి, ఏసిరెడ్డి మహేందర్‌రెడ్డి, బక్క రాంప్రసాద్‌, వంగాల శ్రీశైలం, లక్ష్మి, పద్మాయాదిరెడ్డి, పాం డరి, శ్రీశైలం, జయమ్మ, పద్మాపర్వతాలు, ఉప సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు సత్యనారాయణ, అంజయ్య, నరేందర్‌, రమేశ్‌, భానుచందర్‌, కృష్ణ, సంతోష్‌ తదితరులున్నారు.

పాడి రైతుల సంక్షేమానికి కృషి
పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె ఆలేరు మార్కెట్‌ కమి టీ కార్యాలయంలో ఇటీవల గెలిచిన పాల సం ఘాల చైర్మన్లను సన్మానించి మాట్లాడారు. డీడీలు కట్టిన వారికి రెండో విడుతలో పాడి గేదెలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. సన్మానం పొందిన వారిలో స్వామి, నరేందర్‌రెడ్డి, వెంకటేశ్‌, వీరస్వామి, రాములు, సత్తయ్య, రంగయ్య, మ మత, ఉప్పలయ్య, యాదగిరి, సాంబిరెడ్డి, మైస య్య, ఆంజనేయులు, సోమిరెడ్డి, భాగ్య, సోమ య్య, సిద్ధమ్మ, వెంకటనర్సింహారెడ్డి, నర్సింహులు తదితరులు ఉన్నారు. అంతకుముందు ఆలేరులో బైపాస్‌ రోడ్డు నిర్మాణం కోసం రఘునాథపురం రోడ్డు నుంచి సోమేశ్వర వెంచర్‌ మీదుగా దొంతిరి సోమిరెడ్డి గార్డెన్‌ వరకు పరిశీలించారు. ఆమె వెంట ఆడెపు బాలస్వామి, జంపాల సత్యనారాయణ, కాసగళ్ల అనసూయ, మొరిగాడి ఇందిర, ఆలేటి అనిల్‌, బింగి రవి ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana