e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home యాదాద్రి రైతులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలి

రైతులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలి

మోటకొండూర్‌, ఆగస్టు4: రైతులు విత్తనాలు కొనుగోలు చేసి నప్పుడు వారికి తప్పనిసరిగా బిల్లులను ఇవ్వాలని ఎరువుల దుకాణాదారులకు మండల వ్యవసాయాధికారి సుబ్బూరి సు జాత సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని మన గ్రోమోరు కేంద్రంలో రికార్డులను పరిశీలించి, స్టాక్‌ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ.. ఎరువుల దుకాణదారులు రైతులకు నాణ్యమైన వి త్తనాలనే అమ్మాలని, కల్తీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవని అన్నారు. వ్యవసాయ శాఖ అధికారుల నుంచి అనుమతులు పొందిన ఎరువుల దుకాణాల్లో మాత్రమే రైతులు విత్తనాలను కొనుగోలు చేయాలన్నారు. రైతులు పండించిన పంటల దిగుబ డి వచ్చే వరకు బిల్లును జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు. కార్య క్రమంలో ఏఈవో ప్రణయ్‌రెడ్డి, మన గ్రోమోరు సిబ్బంది మ హ్మద్‌ మంజూర్‌ఖాన్‌, జివిలికపల్లి సాయికుమార్‌ ఉన్నారు.

పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారి
గుండాల: మండలంలోని వస్తాకొండూరు గ్రామంలో బుధ వారం ఆలేరు ఏడీఏ వెంకటేశ్వర్లు పెసర పంటను పరిశీలించా రు. ఈ సందర్భంగా పెసరలో వచ్చే ఆకు రోగానికి ఇమిడా క్లో ప్రైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. అంతకుముందు రైతు వేదికను పరిశీలించారు. వెల్మజాలలో వెదజల్లే పద్దతిలో వేసిన వరి నాటును పరిశీలించారు. వారి వెంట ఏవో సంతోషీ, ఏఈవోలు ఉన్నారు.

- Advertisement -

అధికారుల సూచనలు పాటించాలి
ఆత్మకూరు(ఎం): రైతులంతా పంటల ఎదుగుదల కోసం అ ధికారుల సూచనలు పాటించాలని మండల వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంతో పాటు మొరిపిరాల, కాలువపల్లి గ్రామాల్లోని పత్తి, వరి పంటల ను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తి లో రసం పీల్చే పురుగుల నివారణ కోసం వేప నూనెను పిచి కారీ చేయాలని వరిలో కాండం తొలిచే పురుగుల నివారణ కో సం కార్టఫ్‌ హైడ్రోక్లోరైడ్‌ గులకలను తగిన మోతాదులో చల్లా లని సూచించారు. ఆయనవెంట ఏఈవోలు మనోజ్‌ కుమార్‌, రాజశేఖర్‌, రైతులు యాదగిరి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana