e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home యాదాద్రి రాజగోపాల్‌ రెడ్డి క్షమాపణ చెప్పాలి

రాజగోపాల్‌ రెడ్డి క్షమాపణ చెప్పాలి

చౌటుప్పల్‌, జూలై27: ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని వ్యక్తిగతంగా దూషించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పేదలకు రేషన్‌కార్డులు పంపిణీ చేసేందుకు మున్సిపాలిటీకి వచ్చిన మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతుండగా రాజగోపాల్‌రెడ్డి ఆయన నుంచి మైకు ను గుంజుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. స్థానిక మా ర్కెట్‌ యార్డులో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు అడగడం పక్కన పెట్టి మం త్రి మాట్లాడుతుండగా మైకును గుంజుకోవడం, సమావేశంలో రభస చేయడం రాజగోపాల్‌రెడ్డి కుటిల రాజకీయాలకు అద్దం పడుతుందన్నారు.

ఎమ్మెల్యేగా గెలిచి 30 నెలలు కావస్తున్నా కనీసం మూడుసార్లు కూడా నియోజకవర్గంలో ఆయన పర్యటించలేదని, కాంట్రాక్టుల కోసమే రాజకీయాలను వాడుకుంటున్నావని మండిపడ్డారు. చెల్ల ని చెక్కులిస్తూ , మాయామాటలతో ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నాడని, ప్రజలు మర్చిపోయిన ఎమ్మెల్యేగా ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న నాలుగేండ్ల కాలంలో సీఎం కేసీఆర్‌ను ఒప్పించి రూ.రెండు వేల కోట్లతో చెర్లగూడెం రిజర్వాయర్‌ పనులను ప్రారంభింపజేశానని మాజీ ఎమ్మెల్యే గుర్తుచేశారు. మంత్రిని వ్యక్తిగతంగా దూషించినందుకు ఆయనకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. నియోజకవర్గ అభివృద్ధి మాని రౌడీయిజం చేయాలని చూస్తే ఖబడ్ద్దార్‌ అంటూ హెచ్చరించారు.

- Advertisement -

మాజీ ఎమ్మెల్యే వెంట మున్సిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు, నారాయణపురం ఎంపీపీ, జడ్పీటీసీలు గుత్తా ఉమాదేవి, వీరమళ్ల భానుమతి, టీఆర్‌ఎస్‌ మున్సిపాలిటీ, మండలాధ్యక్షులు ఊడు గు శ్రీనివాస్‌గౌడ్‌, గిర్కటి నిరంజన్‌గౌడ్‌, ఆర్టీఏ జిల్లా మెంబర్‌ తడక చంద్రకిరణ్‌, నాయకులు ఎండి బాబా షరీఫ్‌, తాడూరి పరమేశ్‌, సుల్తాన్‌రాజు, గుండబోయిన వెంకటేశ్‌యాదవ్‌, పాశం సంజయ్‌బాబు, టీఆర్‌ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు నలపరాజు రమేశ్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిపై కేసు నమోదు
మున్సిపాలిటీ కేంద్రంలోని లక్కారం ఎస్‌ఎంఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో సోమవారం జరిగిన రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో రభస చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, అతడి అనుచరులపై చౌటుప్పల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభు త్వ కార్యక్రమమైన రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియను ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, అతడి అనుచరులు అడ్డుకున్నారని, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రసంగిస్తున్న సందర్భంలో మైకు గుంజుకోవడంతోపాటు ఎస్‌ఎంఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారని మంగళవారం తహసీల్దార్‌ గిరిధర్‌ స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డితోపాటు అతడి అనుచరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్‌ తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana