e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home యాదాద్రి నులిపురుగుల నివారణ అందరి బాధ్యత

నులిపురుగుల నివారణ అందరి బాధ్యత

నులిపురుగుల నివారణ అందరి బాధ్యత

మోటకొండూర్‌, జూలై 14: నులిపురుగుల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మండల వైద్యాధికారి రాజేందర్‌నాయక్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్య సిబ్బంది, ఆయా శాఖల అధికారుల తో, ప్రజాప్రతినిధులతో గూగుల్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. 15 నుంచి ఈనెల 17వ తేదీ వరకు ఆశవర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, వలంటీర్‌లు మం డలంలోని ప్రతి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి నులి పురుగుల ని వారణ మాత్రలు వేస్తారని అన్నారు. గర్భిణులు, రెండు సంవ త్సరాల లోపు పిల్లలకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతు న్న వారికి తప్ప 2సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరికీ మాత్ర లను పంపిణీ చేస్తామన్నారు. మాత్రల పంపిణీకి 98 మంది వలంటరీలను, 10 మంది సూపర్‌వైజర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది ప్రవీన్‌కుమార్‌, దేవా వర, మహేశ్‌, సునీత, ఆశవర్కర్లు కవిత, వాణి పాల్గొన్నారు.

మాత్రల పంపిణీని విజయవంతం చేయాలి
ఆత్మకూరు(ఎం): నేటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు మం డలంలోని అన్ని గ్రామాలలో జాతీయ పైలేరియా, నులి పురు గుల నిర్మూలన కోసం ప్రభుత్వం ఉచితంగా అందజేసిన మా త్రల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండ ల వైద్యాధికారి ప్రణీష అన్నారు. బుధవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మా ట్లాడుతూ ప్రతి గ్రామంలోని ప్రజలందరికి పైలేరియా, నూలి పురుగుల నిర్మూలన కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ప్రజా ప్రతినిధులు, అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ తండా మంగమ్మ, తహసీల్దార్‌ జ్యోతి, ఎంపీడీవో రాములు, ఎంపీవో పద్మావతి, స్థానిక సర్పంచ్‌ జన్నాయికోడె నగేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

మాత్రల పంపిణీ విజయవంతం చేయాలి
ఆలేరు టౌన్‌: ఈ నెల 15,16,17 తేదీల్లో డీఈసీ, అల్బెండ జోల్‌ మాత్రల పంపిణీని విజయవంతం చేయాలని శారాజీపే ట పీహెచ్‌సీ వైద్యాధికారి రాజేందర్‌ కోరారు. బుధవారం మాత్రల పంపిణీపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మా ట్లాడుతూ మండలంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ డా. నగేశ్‌, ఎంపీడీవో జ్ఞానప్రకాశ్‌, సీడీపీవో చంద్రకళ, ఎంఈవో లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నులిపురుగుల నివారణ అందరి బాధ్యత
నులిపురుగుల నివారణ అందరి బాధ్యత
నులిపురుగుల నివారణ అందరి బాధ్యత

ట్రెండింగ్‌

Advertisement