e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home యాదాద్రి నాటిన మొక్కలను సంరక్షించుకోవాలి

నాటిన మొక్కలను సంరక్షించుకోవాలి

నాటిన మొక్కలను సంరక్షించుకోవాలి

ఆలేరు టౌన్‌, జూలై 13 : భవిష్యత్తు తరాల కోసం మొక్కలు నాటి సంరక్షించాలని మున్సిపల్‌ చైర్మన్‌ వస్పరి శంకరయ్య కోరారు. ఆలేరులో మంగళవారం హరితహారం కార్యక్రమం లో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆలే రు పట్టణంలో పచ్చదనం పెంచేందుకు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని అన్నారు. ఆయన వెంట పలువురు ప్రజా ప్రతి నిధులు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మానవ మనుగడకు మొక్కలే ఆధారం
మానవ మనుగడకు మొక్కలే ఆధారమని 5వ వార్డు కౌన్సిలర్‌ రాయపురం నర్సింహులు అన్నారు. ఆలేరు మున్సిపల్‌ పరిధి బహదూర్‌పేటలో మంగళవారం హరితహా రం కార్యక్రమంలో భాగంగా మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణంలో సమతుల్యత కోసం మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. హరితహారంలో ప్రతిఒక్కరూ భాగ స్వామ్యం కావాలన్నారు. కార్యక్రమంలో లక్ష్మణ్‌, ఎల్లయ్య, రాంనర్సయ్య, శంకరమ్మ, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవ్వాలి
ఆలేరురూరల్‌: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగ స్వాములవ్వాలని సర్పంచ్‌ పులుగం పద్మ అన్నారు. మంగళ వారం మండలంలోని పటేల్‌గూడెం గ్రామంలో మొక్కలు నా టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..మానవ మనుగ డకు చేట్లే ఆధారమని, ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగస్వా ములై మొక్కలు నాటాలని కోరారు.కార్యక్రమంలో పంచాయ తీకార్యదర్శి సిద్దులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మొక్కలు నాటిన డిపో మెనేజర్‌
ఆత్మకూరు(ఎం): ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో పాటు హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంర క్షించాలని యాదగిరిగుట్ట బస్‌ డిపో మేనేజర్‌ లక్ష్మారెడ్డి అన్నా రు. మంగళవారం మండల కేంద్రంలోని బస్టాండ్‌ సమీపంలో ఉన్న ఖాలీ స్థలంలో వివిధ మొక్కలు నాటారు. కార్యక్రమం లో ఎంపీడీవో రాములు, ఎంపీవో పద్మావతి, సర్పంచ్‌ నగేశ్‌, ఎంపీటీసీ కవిత, మాజీ సర్పంచ్‌ లక్ష్మారెడ్డి, పంచాయతీ కా ర్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, డిపో సూపర్‌వైజర్‌ పాష, ఉద్యోగులు మంగ, రాజిరెడ్డి, కృష్ణ, పాండరి, పవన్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నాటిన మొక్కలను సంరక్షించుకోవాలి
నాటిన మొక్కలను సంరక్షించుకోవాలి
నాటిన మొక్కలను సంరక్షించుకోవాలి

ట్రెండింగ్‌

Advertisement