e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home యాదాద్రి దళిత సాధికారత కోసం..

దళిత సాధికారత కోసం..

దళిత సాధికారత కోసం..
  • రూ.1200 కోట్లతో తెలంగాణ దళిత బంధువు
  • రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు నిర్ణయం
  • బ్యాంకుతో సంబంధం లేకుండా సాయం
  • ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకాలు

యాదాద్రి భువనగిరి, జూలై19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సంక్షేమ పథకాల అమలుతో సబ్బండ వర్ణాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషితో దళితుల జీవితాలు కూడా మెరుగుప డుతూ వస్తున్నాయి. అయితే సామాజికంగా, ఆర్థికంగా శతాబ్దా లుగా వివక్షతకు గురవుతూ వస్తున్న దళిత కుటుంబాలను ప్ర త్యేక శ్రద్ధతో బాగు చేసుకోవాలని సంకల్పించిన సీఎం కేసీఆర్‌ విప్లవాత్మక రీతిలో కార్యాచరణను అమలు చేయబోతున్నారు. దళితులను పేదరికం నుంచి బయట పడేసేందుకు ‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈమేరకు పథకాన్ని అమలులోకి తెస్తూ జీవో ఎంఎస్‌ నంబర్‌ 6ను ప్రభుత్వం విడుదల చేసింది.షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమం, అభివృద్ధి(ఎస్సీ,ఎస్టీఎఫ్‌) కింద ఇప్పటికే కొనసాగుతున్న ప్రగతి కార్యక్రమాలతో సంబంధం లేకుండా తెలంగాణ దళిత బంధు పథకం అమలుకానున్నది. ఈ పథకాన్ని ముందుగా కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలెట్‌ ప్రాజెక్టుగా అ మలు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

బ్యాంకులతో సంబంధం లేకుండా సాయం
రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ దళిత బంధు పథకాన్ని రూ.1200 కోట్లతో అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. పైలెట్‌ ప్రాజెక్టు అమలు కోసం త్వరలోనే కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ వ ర్క్‌షాప్‌ను నిర్వహించనున్నారు. పథకం అమలును పర్యవేక్షిం చడం, ఆ తర్వాత ఫలితాలను అంచనా వేయడం, లబ్ధిదారు లు, ప్రభుత్వ భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేయ డం వంటి మూడు ముఖ్యమైన అంశాల ఆధారంగా తెలంగాణ దళిత బంధు పథకాన్ని అమలు చేసేలా ప్రణాళికను రూపొంది స్తున్నారు. ఎలాంటి బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా రూ.10లక్షల చొప్పున నగదు సాయాన్ని పూర్తి గ్రాంటు రూ పంలో అందజేయనున్నారు. రైతు బంధు తరహాలో తెలంగాణ దళితబంధు లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా ఆర్థికసాయాన్ని ప్ర భుత్వం జమ చేయనున్నది. అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని త్వరలోనే జిల్లాలోనూ ఈ పథకాన్ని ప్ర భుత్వం అమలు చేయనున్నది. అర్హులైన వారందరికీ తెలంగా ణ దళితబంధు సాయం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.

- Advertisement -

దళిత కుటుంబాల్లో వెల్లువెత్తుతున్న సంతోషం
తెలంగాణ దళిత సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపించేం దుకు సీఎం కేసీఆర్‌ అమలు చేసేందుకు సంకల్పించిన ‘ తెలం గాణ దళిత బంధు’ పథకంపై జిల్లాలోని దళిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దళత మేధావులు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దళితుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులకు ఈ పథకం నాంది పలుకు తుందని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్థిక సంక్షోభం లోనూ దళిత జాతి అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ కంకణం క ట్టుకోవడం హర్షణీయమని కొనియాడుతున్నారు. ఇటీవల మరియమ్మ లాకప్‌ డెత్‌ విషయంలో సీఎం కేసీఆర్‌ తక్షణమే స్పందించి వారి కుటుంబానికి అండగా నిలువడం.. పోలీసుల పై చర్యల వంటి నిర్ణయాలు తీసుకోవడం గొప్ప విషయమని ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు సీఎం కేసీఆర్‌ తపన అమోఘమని, దళిత స మాజం ఆయనకు ఎల్లవేళలా రుణపడి ఉంటుందని దళిత కుటుంబాలు పేర్కొంటున్నాయి.

కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకుంటాం
రాజాపేట: దళిత సంక్షేమం కోసం దళిత బంధు పథకం ప్రవేశపెట్టడం హర్షణీయం. దళితులు జీవితాల్లో వెలుగులు నింపుతు న్న సీఎం కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకుంటాం. ప్రభుత్వ పరం గా నేరుగా సాయం అందిస్తామని ప్రకటించడం ఏంతో గొప్ప నిర్ణయం.ఈ పథకం ప్రవేశ పెట్టిన సీఎకు ప్రత్యేక కృతజ్ఞతలు.

  • రామిండ్ల నరేందర్‌, రఘునాథపురం

దళితుల జీవితాల్లో వెలుగులు
రామన్నపేట: ప్రభుత్వం తీసుకు వచ్చిన దళితబంధు పథకం బడుగుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. దళిత సాధికారత కు దోహదపడుతుంది. లబ్ధిదారుడి ఖాతా లోనే నేరుగా 10 లక్షలు జమ చేసి వారు ఎంచుకున్న ఉపాధి రంగాన్ని అభివృద్ధి చేసుకునే వెసులుబాటు ఇవ్వడం గొప్ప అవకాశం. ఆ కుటుంబానికి భరోసాగా ఉంటుంది.

  • బందెల రాములు, మాజీ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌

దళిత బంధుతో సామాజిక న్యాయం
బొమ్మలరామారం: దళిత బంధు పథకం తో సామాజిక న్యాయం లభిస్తుంది. రాష్ట్ర చరిత్రలో దళితుల అభ్యున్నతి కోసం ఇంత మొత్తం కేటాయించిన సీఎంలు ఇప్పటివరకూ ఎవరూ లేరు. తెలంగాణ ఎస్సీల ఆత్మగౌరవం పెంచేవిధంగా ఉన్న దళిత బంధు పథకాన్ని స్వాగతిస్తున్నాం.

  • మైలారం రామకృష్ణ, మండల టీఆర్‌ఎస్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దళిత సాధికారత కోసం..
దళిత సాధికారత కోసం..
దళిత సాధికారత కోసం..

ట్రెండింగ్‌

Advertisement