e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home యాదాద్రి తెలంగాణలో స్వర్ణయుగ పాలన

తెలంగాణలో స్వర్ణయుగ పాలన

తెలంగాణలో స్వర్ణయుగ పాలన

రాజాపేట, జూలై 19: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అం దిస్తున్న జనరంజక పాలనకు జనం జేజేలు పలుకుతున్నారని డీసీసీబీ చైర్మన్‌, రాష్ట్ర టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యమనేత సీఎం కేసీఆర్‌ అందిస్తున్న స్వర్ణయుగ పాలన దేశానికే ఆదర్శం గా నిలుస్తున్నదన్నారు. తరతరాలుగా చెప్పుకునేలా చరిత్రలో నిలిచిపోయేలా రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ, దేశం లో ఎక్కడా లేని విధంగా చెప్పినవే కాకుండా చెప్పనవి ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. గత అరువై ఏండ్లుగా జరుగని అభివృద్ధి టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వ హాయంలోజరిగిందని తెలంగాణ సర్కార్‌ ఆనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేయడంతో రాష్ట్రంలో సబ్బండ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నా రు. రాష్ట్రంలో గత యాసంగిలో 93వేల మెట్రిక్‌ టన్నుల ధా న్యం ఉత్పత్తి జరిగిందని, దేశంలోనే తెలంగాణ ధాన్య భాండా గారంగా నిలించిదన్నారు.

రైతులు ఆరుగాలం కష్టించి పండిం చిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసి రికార్డు సాధించి దన్నారు. భారతదేశంలో అద్భుతమైన లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్మిణాన్ని చూసిన బండి సంజయ్‌కు కండ్లు చెదిరి నోటి మాట రాట్లేదన్నారు.. ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష పాత్ర పోషించటంలో పూర్తిగా విఫలమయ్యారని, మంచిని, మంచి గా చెడును చెడుగా చెప్పాలని హితవు పలికారు. బండి సంజ య్‌ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, సీఎం కేసీఆర్‌ ను విమర్శించే నైతిక హక్కులేదన్నారు. ఇష్టమెచ్చినట్లుగా అదే పనిగా విమర్శిస్తే తెలంగాణ సమాజం ఊరుకోబోదని హెచ్చ రించారు. అభివృద్ధి చూసి ఓర్వలేక బీజేపీ నాయకులు ఉనికిని చాటుకోవడం కోసం రాష్ట్ర అభివృద్ధి ప్రదాతపై విమర్శలు చే స్తున్నారని ఎద్దెవా చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో రాజకీయ ప్రమే యం లేకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సమా వేశంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి, జడ్పీటీ సీ చామకూర గోపాల్‌గౌడ్‌, సర్పంచ్‌ కంచర్ల శ్రీనివాస్‌రెడ్డి, మ దర్‌డెయిరీ డైరెక్టర్‌ చింతలపూరి వెంకట్‌రాంరెడ్డి, టీఆర్‌ఎస్‌ సె క్రటరీ జనరల్‌ సందిల భాస్కర్‌గౌడ్‌, టీఆర్‌ఎస్వీ మండలాధ్య క్షుడు కనకరాజు ప్రధాన కా ర్యదర్శి సంతోశ్‌ గౌడ్‌, నాయకులు తిరుమలేశ్‌, నవీన్‌, జశ్వం త్‌, మహేందర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తెలంగాణలో స్వర్ణయుగ పాలన
తెలంగాణలో స్వర్ణయుగ పాలన
తెలంగాణలో స్వర్ణయుగ పాలన

ట్రెండింగ్‌

Advertisement