మోత్కూరు, జూలై 18: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లా సమగ్రాభి వృద్ధి కోసం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి నిరంతరం పరితపిస్తున్నాడని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పోరేషన్ చైర్మన్ కంచ ర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి జగదీశ్‌రెడ్డి జన్మ దినం సందర్భంగా మండలంలోని దత్తప్పగూడెం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ అవి ర్భావం నుంచి సీఎం కేసీఆర్‌కు వెన్నంటి ఉండి పని చేశార న్నా రు. కార్యక్రమంలో పార్టీ గ్రామాధ్యక్షుడు కన్నెబోయిన సత్త య్య, సర్పంచ్ ఎలుగు శోభ, మండల కో అప్షన్ ఎస్కే సాజిద్ పాష, రైతుబంధు సమితి కో అర్డినేటర్ ఎలుగు సత్తయ్య, నా యకులు యాదయ్య, గంగుమల్లు, అయిలయ్య, అశ్రఫ్జానీ, వెంకటేశ్, రవి, సైదులు, ఉపేందర్, మల్లేశ్ పాల్గొన్నారు.
పేదల పెన్నిధి మంత్రి జగదీశ్‌రెడ్డి
చౌటుప్పల్: పేదల పెన్నిధిగా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నాడని మాజీ ఎమ్మెల్యే కూసు కుంట్ల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. మంత్రి జగదీశ్‌రెడ్డిని హైదరా బాద్‌లోని ఆయన నివాసంలో కూసుకుంట్ల కలిసి శుభాకాం క్షలు తెలిపారు. పూలమాల, శాలువాతో సత్కరించారు.
శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు
భువనగిరి అర్బన్:మంత్రి జగదీశ్‌రెడ్డి జన్మదినం సందర్బంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి హైదరాబా ద్‌లోని ఆయన స్వగృహంలో మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలియజేసారు. నార్ముల్ మదర్ డెయిరీ చైర్మన్ జితేందర్‌రెడ్డి మంత్రికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
మొక్కవోని నాయకుడు జగదీశ్‌రెడ్డి
యాదాద్రి: రాష్ట్ర ప్రజల గుండెల్లో మొక్కవోని నాయకుడిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నిలిచారని ఎన్డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కురుక్షేత్రంలో జగదీశ్‌రెడ్డి ఉదయించిన సూర్యుడని అభివర్ణించారు. ఆదివా రం మంత్రి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లో మంత్రికి శాలువ కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
అభివృద్ధి ప్రధాత మంత్రి జగదీశ్‌రెడ్డి
చౌటుప్పల్: ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రధాతగా మం త్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చిరకాలం ప్రజల గుండెల్లో నిలిచి పోతారని మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు తెలిపారు. మార్కెట్ యార్డులో టీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షు డు ఊడుగు శ్రీనివాస్‌గౌడ్, ఆర్టీఏ జిల్లా మెంబర్ తడక చంద్రకి రణ్, కౌన్సిలర్లు ఎండీ బాబాషరీఫ్, కొరగాని లింగస్వామి, శాఖ గ్రంథాలయం చైర్మన్ ఊడుగు మల్లేశ్‌గౌడ్, నాయకులు బత్తుల స్వామిగౌడ్, బొడిగె బాలకృష్ణ, బొమ్మిరెడ్డి వెంకట్‌రెడ్డి, కానుగు వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.
మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో
మోత్కూరు: మంత్రి జగదీశ్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ఆది వారం మోత్కూరు మున్సిపల్ కార్యాలయం ఆవరణలో చైర్ పర్సన్ తీపిరెడ్డి సావిత్రీ మేఘారెడ్డి కేక్ కట్ చేశారు. ఈ సంద ర్భంగా స్వీట్లు పంచి పెట్టారు. అనంతరం మొక్కలు నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ బొల్లేపల్లి వెంకటయ్య, వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ మేఘారెడ్డి, మాజీ వైస్ చై ర్మన్ కొణతం యాకుబ్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు పురుగుల వెంకన్న, బొడ్డుపల్లి కల్యాణ్ చక్రవర్తి, దబ్బెటి విజయ, రజిత, వనం స్వామి, రైతు బంధు సమితి మండల కో అర్డినేటర్ కొం డ సోంమల్లు, మండల కార్యదర్శి గజ్జి మల్లేశ్, కో అప్షన్ నర్సిం హా, ఆనందమ్మ, శాహినీ సుల్తానా, ప్రజా ప్రతినిధులు చింతల విజయభాస్కర్‌రెడ్డి, వీరస్వామి, వెంకటేశ్వర్లు, శ్రీను, పద్మారె డ్డి, నర్సయ్య, అనిత, స్వామిరాయుడు, అనిల్, తిరుమలేశ్, రఘుపతి, శ్రీనివాస్, రాజయ్య,వెంకన్న పాల్గొన్నారు.
గుట్టలో ఘనంగా మంత్రి జగదీశ్‌రెడ్డి జన్మదిన వేడుకలు..
యాదగిరిగుట్టలో మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి జన్మదినం సంద ర్భంగా ఆదివారం యాదగిరిగుట్ట పురపాలక సంఘం కార్యాల యంలో మున్సిపల్ పాలకవర్గం కేక్ కట్ చేశారు. కార్యక్రమం లో మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధాగౌడ్, మార్కెట్ కమి టీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ మేడబో యిన కాటంరాజు, టీఆర్ఎస్ నాయకులు అంకం నర్సింహా, మిట్ట వెంకటయ్య, కీసరి బాలరాజుగౌడ్ పాల్గొన్నారు.
మొక్కలు నాటిన జడ్సీటీసీ గోళి ప్రణీతారెడ్డి
బీబీనగర్:మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి జన్మదినం సంద ర్భంగా ఆదివారం మండల కేంద్రంలో యాదాద్రి భువనగిరి జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ స్థాయి సంఘం చైర్మన్, జడ్పీటీసీ గోళి ప్రణీతారెడ్డి, సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మితో కలసి బీబీ నగర్ పట్టణంలో మొక్కలు నాటారు. అనంతరం మండల కేం ద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జడ్పీటీసీ ప్రణీతారెడ్డి, ఎంపీ పీ సుధాకర్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ బొక్క జైపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆల్వ మోహన్ రెడ్డితో కలసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ ప్రదాన కార్యదర్శి చింతల సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్ మంచాల రవి కుమా ర్, నాయకులు కొలను దేవేందర్ రెడ్డి, మంగ అశోక్, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామాధ్యక్షులు పాల్గొన్నారు.
ఘనంగా మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు
సంస్థాన్ నారాయణపురంలో మంత్రి జగదీశ్ రెడ్డి జన్మదినం సం దర్భంగా జడ్పీటీసీ వీరమల్ల భానుమతీ గౌడ్ ఆధ్వర్యంలో ఆ దివారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, గుత్తా ప్రేమ్చందర్ రెడ్డి, వీరమల్ల వెంకటేశ్, బాలు నాయక్, సర్వేల్ సర్పంచ్ కట్టెల భిక్షపతి, జంగయ్య, కృష్ణయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.