ప్రభాస్‌ సినిమాలో ఛాన్స్‌ కొట్టేసిన యంగ్‌ హీరోయిన్‌

ప్రభాస్‌ రాధేశ్యామ్‌ సినిమాలో పోషించిన రిద్ధి కుమార్‌ ఐడియా ఉందా?

ట్రైన్‌ సీన్‌లో యాక్సిడెంట్‌ జరిగి చేతిని కోల్పోయే పాత్రలో నటించింది రిద్ధికుమార్‌.

అప్పుడు ప్రభాస్‌ పక్కన చిన్న పాత్రలో కనిపించిన ఈ అమ్మడు.. ఇప్పుడు రెబల్ స్టార్‌ సరసన హీరోయిన్‌గా నటించే ఛాన్స్‌ కొట్టేసింది.

మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ నటిస్తున్న సినిమాలో రిద్ధి కుమార్‌ హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది.

ప్రభాస్‌- మారుతి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్లుగా ఎంపికయ్యారు.

ఇప్పుడు మూడో హీరోయిన్‌గా రిద్ధి కుమార్‌ను ఖరారుచేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మహారాష్ట్రలోని పుణెకు చెందిన రిద్ధి కుమార్‌.. ఫిలాసఫీలో డిగ్రీ పూర్తి చేసింది. చదువుకుంటూనే మోడలింగ్‌ చేసింది. పలు యాడ్స్‌లోనూ నటించింది.

ఫేస్‌ ఆఫ్‌ ఇండియా అందాల పోటీల్లో క్యూటెస్ట్‌ ఫేస్‌గా నిలిచింది. ఆ తర్వాత టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

రాధే శ్యామ్‌ కంటే ముందు రిద్ధి.. 2018లో రాజ్‌ తరుణ్‌తో లవర్ సినిమాలో నటించింది. అదే ఏడాది అనగనగా ఓ ప్రేమకథ చిత్రంలోనూ నటించింది.