Yellow Star
Yellow Star

ఏజెంట్ బ్యూటీకి  ఇంత క్రేజ్ ఉందా !!

 Sakhi Vaidya

Yellow Star
Yellow Star

sakshi vaidya

ఒక్క పోస్ట‌ర్‌తోనే టాలీవుడ్ మొత్తాన్ని త‌న వైపు తిప్పేసుకుంది సాక్షి వైద్య‌.

Yellow Star
Yellow Star

ఏజెంట్ సినిమా నుంచి ఇటీవ‌ల విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌ పోస్ట‌ర్ చూసి సినీ అభిమానులంతా ఫిదా అయిపోతున్నారు.

అస‌లు సాక్షి వైద్య ఎవ‌రు? త‌న బ్యాక్‌గ్రౌండ్ గురించి సోష‌ల్ మీడియాలో వెతికేస్తున్నారు.

Yellow Star
Yellow Star

sakshi vaidya

నిజానికి ఈ అమ్మ‌డికి ఏజెంట్ పోస్ట‌ర్ రిలీజ్ కాక‌ముందు నుంచి కూడా టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది.

ఇప్ప‌టికే త‌మ సినిమాలో సాక్షిని హీరోయిన్‌గా తీసుకోవాల‌ని మెగా యువ హీరోలు కూడా పోటీప‌డుతున్నారు.

Yellow Star

SAKSHI VAIDYA

గ‌రుడ వేగ ఫేమ్ ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమాలో హీరోయిన్‌గా సాక్షిని ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది.

కార్తిక్ దండు ద‌ర్శ‌క‌త్వంలో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టిస్తున్న సినిమాలోనూ సాక్షినే హీరోయిన్‌గా అనుకుంటున్నారు.

Yellow Star
Yellow Star

sakshi vaidya

వైష్ణ‌వ్ తేజ్ త‌ర్వాత సినిమాలోనూ ఈమెనే తీసుకుంటున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఇక నాగ‌చైత‌న్య త‌ర్వాత సినిమాకు కూడా సాక్షినే ఫైన‌ల్ చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌.

Yellow Star
Yellow Star

ఇలా మొత్తానికి ఒక్క సినిమా కూడా విడుద‌ల కాక‌ముందే వ‌రుస అవ‌కాశాలను తెచ్చుకుంటుంది సాక్షి.

Yellow Star
Yellow Star

చ‌దువు పూర్తి కాగానే సాక్షి వైద్య ఫ్యాష‌న్ రంగంలోకి వ‌చ్చింది.

ముంబైలో ఉండి సినీ అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తున్న స‌మ‌యంలోనే ప‌లు టీవీ యాడ్స్‌లో కూడా న‌టించింది.

Yellow Star
Yellow Star

ఇలా మోడ‌ల్‌గా పాపులారిటీ తెచ్చుకుంటున్న స‌మ‌యంలోనే ఏజెంట్ చిత్రంలో న‌టించే ఛాన్స్ ద‌క్కించుకుంది.