Aliens

మ‌హిళ‌ను ప్రెగ్నెంట్ చేసిన ఏలియ‌న్స్ !!

గ్ర‌హంత‌రవాసులు నిజంగా ఉన్నారా? వాళ్లు భూమిపైకి వ‌చ్చారా? ఇది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

ఇప్ప‌టికే కొంత‌మంది త‌మ‌కు ఏలియ‌న్స్ క‌నిపించాయ‌ని.. వాళ్ల యూఎఫ్‌వో చూశామ‌ని చెప్పుకొచ్చారు.

అవ‌న్నీ ఊహ‌లేన‌ని చాలామంది కొట్టిపారేశారు. దీంతో ఏలియ‌న్స్ ఉన్నాయా? లేదా? అన్న దానిపై స్ప‌ష్ట‌త మాత్రం రాలేదు.

ఏలియ‌న్స్ గురించి ఇప్పుడు బ‌య‌ట‌ప‌డ్డ విష‌యం సంచ‌ల‌నంగా మారింది. ఒక మ‌హిళ‌ను ఏలియ‌న్స్ గ‌ర్భ‌వ‌తిని చేశాయ‌న్న వార్త ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

మామూలుగా ఇదే విష‌యాన్ని ఎవ‌రైనా చెబితే ఫేక్ అని అంతా కొట్టిపారేసేవాళ్లు. కానీ ఇక్క‌డ ఆ ఛాన్స్ లేదు.

ఈ విష‌యాన్ని స్వ‌యానా అమెరికా ర‌క్ష‌ణ కార్యాల‌యం పెంట‌గాన్‌కు చెందిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఒక డాక్యుమెంట్‌లో తెలిపింది.

ఓ వ్యక్తి వేసిన సమాచార హక్కు పిటిషన్‌ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ప్రఖ్యాత వార్తాసంస్థ ‘ది సన్‌’ వెల్లడించింది.

ఏలియ‌న్స్‌ను చూసిన వారిలో జుట్టు రాల‌డం, త‌ల‌నొప్పి, జ్వ‌రం, పీడ‌క‌ల‌లు, ముక్కులో నుంచి ర‌క్తం కార‌డం, కాలిన గాయాలు వంటి స‌మ‌స్య‌లు క‌నిపించాయ‌ని పేర్కొంది.

ఈ క‌థ‌నంపై అమెరికా అధికారులు అయితే ఇంకా స్పందించ‌లేదు.