ఏవైపు తిరిగి ప‌డుకుంటే మంచిది?

Health Tips

మనం రకరకాల భంగిమల్లో నిద్రపోతాం. కుడి, ఎడమలు తిరిగి తిరిగి పడుకుంటాం. వెల్లకిలా, బోర్లా తిప్పి తిప్పి పడుకుంటాం.

ఒత్తిగిలి పడుకోవడం, అందులోనూ ఎడమవైపు పడుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలంటున్నారు నిపుణులు.

మన పొట్టలో ఎడమవైపు జీర్ణాశయం, క్లోమగ్రంథి ఉంటాయి. ఎడమవైపు తిరిగి పడుకున్నప్పుడు అవి భూమ్యాకర్షణ శక్తికి లోనై వేలాడినట్టుగా అవుతాయి. దానివల్ల జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది.

ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల రోగ నిరోధకతను బలోపేతం చేసే శోషరస వ్యవస్థ కూడా ఉత్తేజితం అవుతుంది.

మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక పది నిమిషాలు ఎడమవైపు తిరిగి పడుకోవడం ఆరోగ్యానికి మంచిది.

గుండె శరీరానికి ఎడమ భాగంలోనే ఉంటుంది. కాబట్టి అటువైపు తిరిగి పడుకోవడం వల్ల రక్త ప్రసరణ సులభం అవుతుంది. గుండెకూ కొంతమేర విశ్రాంతి దొరికినట్టు అవుతుంది.

గర్భిణులు ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల పిండానికి, గర్భాశయానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. కడుపులో ఉన్న బిడ్డకు నేరుగా పోషకాలు చేరతాయి.

ఇలా పడుకోవడంతో వెన్నెముక మీద ఒత్తిడి కూడా తగ్గుతుంది. తద్వారా సౌకర్యంగా అనిపించి నిద్ర బాగా పడుతుంది.

ఒత్తిగిలి పడుకున్నప్పుడు మోకాళ్లు దగ్గరికి మడిచి కాళ్ల మధ్యలో దిండు పెట్టుకుంటే మరింత సౌకర్యంగా నిద్ర పోవచ్చు.

గురక సమస్య ఉన్నవారికి ఈ భంగిమ మేలు చేస్తుంది. ఇలా తిరిగి పడుకోవడం వల్ల నాలుక, గొంతు సమాంతర స్థితిలో ఉంటాయి. శ్వాస సులభం అవుతుంది.

గురక చాలా వరకు తగ్గుతుంది. శ్వాస వ్యవస్థ చక్కగా పనిచేసేందుకూ ఈ భంగిమ తోడ్పడుతుంది.