periods

పీరియ‌డ్స్ టైమ్‌లో  ఏ ఫుడ్‌ తీసుకోవాలి?

Menstruation Diet

నెల‌స‌రి స‌మయంలో స్త్రీల‌కు చాలా ఇబ్బందిక‌రంగా, అసౌక‌ర్యంగా ఉంటుంది. ఆ టైమ్‌లో నీర‌సంగా ఉంటారు.

కొంద‌రిలో వికారం, తిమ్మిర్లు వంటి ల‌క్ష‌ణాల‌తో పాటు ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు ఉంటాయి.

పీరియ‌డ్స్ టైమ్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

వాస్తవానికి పీరియడ్స్ సమయంలో ప్ర‌తి ఒక్క‌రూ విటమిన్లు, ప్రోటీన్లను ఎక్కువగా తీసుకోవాలి.

సిట్రస్ పండ్లు, బెర్రీలు, ద్రాక్షల నుంచి విటమిన్-సి పొంద‌వ‌చ్చు. ఇవి రీ ప్రొడ‌క్టివ్ సిస్ట‌మ్‌ను ఉత్తేజ‌ప‌రుస్తుంది.

రుతుస్రావం స‌మ‌యంలో కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్స్ ఎక్కువ‌గా ఉండే ఆహారం తీసుకోవాలి.

శ‌రీరంలోని షుగ‌ర్ లెవ‌ల్స్‌ను నియంత్రించేందుకు నారింజ‌, క్యారెట్‌, రేగు పండ్లు తింటే మంచిది.

డార్క్ చాక్లెట్ తింటే మంచిది. మాన‌సిక స్థితిని నియంత్రించ‌డంలో స‌హాయ‌ప‌డే సెరోటోనిన్ హార్మోన్ ఉత్ప‌త్తి చేయ‌డానికి ఇది స‌హాయ‌ప‌డుతుంది.

కోడి గుడ్లు, పాలు కూడా మంచి బలమైన ఆహారం.

పీరియ‌డ్స్ టైమ్‌లో స్త్రీలు ఎదుర్కొనే సాధార‌ణ స‌మ‌స్య‌ల్లో క‌డుపులో తిమ్మిరి కూడా ఒక‌టి. ఫ్యాటీ ఆమ్లాల‌ను తీసుకోవ‌డం ద్వారా వాటిని నియంత్రించ‌వచ్చు.

గుమ్మ‌డికాయ గింజ‌లు, అవిసె గింజ‌లు, పొద్దు తిరుగుడు విత్త‌నాల్లో ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి.

రుతుస్రావ స‌మ‌యంలో ర‌క్త‌స్రావం కూడా అధికంగా అవుతుంది. కాబ‌ట్టి మ‌హిళ‌లు ఐర‌న్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. దీనివ‌ల్ల ర‌క్త‌హీన‌త‌తో పోరాడ‌వ‌చ్చు.