ఎండు ద్రాక్షలు మంచి పోషక విలువలున్న ఆహారం. వీటిని ప్రతి రోజు మితంగా తింటే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం
ఎండు ద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియను ప్రోత్సహించి మలబద్దకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
శరీరంలో ఇనుము స్థాయిని పెంచి రక్తహీనతనుంచి కాపాడుతాయి.
శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఐరన్, విటమిన్ బికాంప్లెక్స్ అందుతాయి.
ఎండుద్రాక్షలో ఉండే పోలిఫినోలిక్ యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ రాకుండా కాపాడుతాయి
ఎండుద్రాక్షలో ఉన్నపొటాషియం, మెగ్నీషియం ఎసిడిటిని తగ్గించడానికి దోహదం చేస్తాయి
ఎండు ద్రాక్షలో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మం ఆరోగ్యంగా ఉండటానికి దోహదం చేస్తాయి. ముఖంపై వృద్ధాప్య లక్షణాలను నివారిస్తాయి
ఎండు ద్రాక్ష గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. అందువల్ల చెక్కెర వ్యాధి ఉన్నవారు కూడా తీసుకోవచ్చు
ఎండు ద్రాక్ష తినడవల్ల కొందరికి ఎలర్జీ లాంటి సమస్యలు తలెత్తవచ్చు. ఇలాంటి వారు డాక్టర్ సలహా మేరకు ఎండు ద్రాక్షను తీసుకోవాలి