premature delivery
ముందస్తు ప్రసవాలు ఎందుకు అవుతాయి?
Preterm birth
ఐవీఎఫ్ వంటి కృత్రిమ పద్ధతుల్లో గర్భధారణ వల్ల ముందస్తు ప్రసవాలకు ఆస్కారం ఎక్కువ.
ప్రసవానికి, మరో గర్భానికి మధ్య ఆరు నెలల కంటే తక్కువ సమయం తీసుకున్నప్పుడు కూడా ఈ ముప్పు తప్పదు.
“
గర్భంలో ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడూ ఇలా జరుగవచ్చు. అధిక బరువు, మరీ తక్కువ బరువు కూడా ముందస్తు ప్రసవానికి మూలమే.
గర్భధారణ సమయంలో మధుమేహం, అధిక రక్తపోటు నిర్ణీత సమయానికి ముందే శిశువు తల్లి గర్భం నుంచి బయటికి వచ్చేందుకు కారణం అవుతాయి.
గాలి కాలుష్యం, రేడియేషన్, హానికర రసాయనాల ప్రభావంతో పాటు ధూమపానం, మద్యపానం, మాదక ద్రవ్యాలు కూడా దీనికి ఓ కారణమే.
ఒత్తిడి తల్లీబిడ్డలకు చేటు చేస్తుంది. వృత్తిగత, వ్యక్తిగత జీవితాల్లో ఎదురయ్యే ఒత్తిళ్లు కూడా ముందస్తు ముప్పునకు సంకేతాలు.
గర్భాశయం, మూత్రనాళం, యోనికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు కూడా ముందస్తు ప్రసవానికి దారితీస్తాయి.
గర్భాశయం, గర్భాశయ ద్వారం, జరాయువు (ప్లాసెంటా)కు సంబంధించిన సమస్యలు ఉంటే కనుక, వెంటనే చికిత్స తీసుకోవాలి.
తాజా పండ్లు, కూరగాయలు, ముతక ధాన్యాలు, పప్పులు వంటి సమతుల ఆహారం తీసుకోవాలి.
ప్రాసెస్ చేసిన, నూనెలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
వ్యసనాలను వదిలించుకోవాలి. నిపుణుల పర్యవేక్షణలో వ్యాయామం చేయాలి. సరైన బరువు కొనసాగించాలి.
తగినంత నిద్ర అవసరం. అధిక శ్రమ వద్దు. యోగా, ధ్యానం లాంటి ఉపశమన విధానాలను అనుసరించాలి.
క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. వైద్యులు సూచించినట్లు నడుచుకోవాలి