ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ ఆరోగ్యానికి మంచిదేనా?

రోజులోని 24 గంటల్లో నిర్దిష్టంగా కొన్ని గంటలపాటు ఏమీ తినకుండా.. ఇంకొన్ని గంటల్లో పోషకాహారం తీసుకునే పాక్షిక ఉపవాస విధానం ఇది. ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ను 3 రకాలుగా విభజించవచ్చు. 

ఒకటి.. 12 గంటల ఫాస్టింగ్‌. రాత్రి భోజనానికి, ఉదయం అల్పాహారానికి మధ్య 12 గంటలు వ్యవధి ఉండాలి. మధ్యలో నీళ్లు మినహా చాయ్‌ కూడా తాగకూడదు. 

అలాగే 14 గంటలు, 16 గంటల ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ విధానాలూ ఉన్నాయి. మిగతా సమయంలోనే రెండు భోజనాలూ పూర్తి చేస్తారు. 

ఆ 14, 16 గంటలూ ఏమీ తినరు. ఈ తరహా ఉపవాసం చేసేప్పుడు శరీరానికి ప్రొటీన్‌, పీచు పదార్థాలు అధికంగా అవసరం అవుతాయి.

అందుకు ఫైబర్‌ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు, సలాడ్లు తీసుకోవాలి. అలాగే ప్రొటీన్‌ కోసం గుడ్డు, పప్పులు, సోయా, డ్రైఫ్రూట్స్‌ తినాలి.

స్నాక్స్‌గా బాదం, వాల్‌నట్‌ లాంటివి ఎంచుకోవచ్చు. వీటిలో ఆవశ్యక కొవ్వులు దొరుకుతాయి.

సాధారణంగా బరువు తగ్గేందుకు, రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణకు ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ను ఎంచుకుంటారు.

20-40 సంవత్సరాల మధ్య వయసు వారికే ఇది సమర్థంగా పని చేస్తుంది. మిగిలినవాళ్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం.