Palm Tree
Palm Tree

ఆటో రాంప్రసాద్‌ తలకు ఏమైంది?

Jabardasth Actor

జబర్దస్త్‌ కామెడీ షోలో సుడిగాలి సుధీర్‌ టీమ్‌ గురించి ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయక్కర్లేదు

సుడిగాలి సుధీర్‌, ఆటో రాంప్రసాద్, గెటప్‌ శ్రీను ఇలా ఒకరికొకరు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

వీరిలో సుధీర్‌ ఇప్పటికే హీరోగా మారిపోయాడు. తాజాగా గాలోడు సినిమాతో హిట్‌ అందుకున్నాడు.

అయితే ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు, సక్సెస్‌ మీట్‌కు రాంప్రసాద్‌ హాజరు కాలేదు. దీంతో అతను ఎందుకు రాలేదని సందేహాలు చాలామందికి వచ్చాయి.

ఈ క్రమంలో గాలోడు సక్సెస్‌ను ఎంజాయ్‌ చేసేందుకు ఈ త్రీమంకీస్‌ కలుసుకున్నారు. ఈ సందర్భంగా దిగిన ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఆ ఫొటోలో ఆటో రాంప్రసాద్‌ తలకు కవర్‌ తొడుక్కుని కనిపించడంతో ఏమైందని ఫ్యాన్స్‌ ఆరా తీస్తున్నారు.

అయితే రాంప్రసాద్‌ తలకు ఏదో సర్జరీ జరిగిందని అందుకే రాలేదని వార్తలు వస్తున్నాయి.

రాంప్రసాద్‌ తలకు సర్జరీ చేయించుకోవడం వల్లే గాలోడు ఈవెంట్‌కు రాలేకపోయాడని గెటప్‌ శ్రీను చెప్పినట్టుగా తెలుస్తోంది.