ఖాళీ కడుపుతో నిద్రపోతున్నారా?

Brooklyn Simmons

చాలామంది రాత్రిపూట ఏమీ తినకుండా నిద్రపోతుంటారు. మరికొందరు బరువు తగ్గాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తుంటారు.

ఇలా ఎప్పుడైనా ఒకసారి జరిగితే ఏం పర్వాలేదు. అదే అలవాటుగా మారితే అనర్థాలకు గురికావాల్సి ఉంటుంది.

తినకుండా నిద్రపోతే ఆ ప్రభావం శరీరాన్ని కంట్రోల్ చేసే హార్మోన్లు, నరాలపై పడుతుందని వైద్యులు చెబుతున్నారు.

రాత్రి తక్కువ క్వాంటిటీ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలన్నది నిజమే కానీ.. మొత్తానికే రాత్రి భోజనం మానేయడం మంచిది కాదు.

ఇలా రాత్రి పూట ఏమీ తిన‌కుండా నిద్ర‌పోతే అనవసరంగా బరువు పెరుగుతారు.

ఏమీ తినకుండా రాత్రి నిద్రపోయి, ఉదయం టిఫిన్ చేసి ఆఫీసుకి వెళ్తే ఏకాగ్రతతో పని చేయలేరు.

రాత్రి ఆహారం తీసుకోకుండా నిద్రపోవడం వల్ల శరీరంలో పోషకాహార లోపం తలెత్తుతుంది.

శరీరం సమర్థ‌వంతంగా పని చేయడానికి మెగ్నీషియం, విటమిన్ బీ 12, విటమిన్ డీ 3 వంటి పోషకాలు ఎంతో అవసరం.

డిన్నర్ చేయకపోవడం అలవాటుగా మారితే జీవక్రియకు అది ఎంతో హాని చేస్తుంది. 

శరీరంలోని అతిముఖ్యమైన హార్మోన్ ఇన్సులిన్ స్థాయిని ప్రభావితం చేస్తుంది. 

కొలెస్ట్రాల్, థైరాయిడ్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. హార్మోన్లపై కూడా ఆ ప్రభావం పడుతుంది.

ఖాళీ కడుపుతో నిద్ర సరిగా పట్టదు. ఆకలి మానసికంగానూ ఎంతో వేధిస్తూ ఉంటుంది.