Weekly Horoscope

22/5/22 to 28/5/22

White Scribbled Underline

స్థిర, చరాస్తుల ద్వారా ఆదాయం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా కొనసాగుతాయి. తొలుత ఆటంకాలు ఎదురైనా పనులు సకాలంలో పూర్తవుతాయి. వాహన మరమ్మతులు ముందుకు రావచ్చు. తగాదాలకు దూరంగా ఉండటం అవసరం. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

Heptagram
Heptagram

బంధువర్గంతో సఖ్యత పెరుగుతుంది. భూముల కొనుగోలు వ్యవహారం అనుకూలిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరమైన తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులకు విదేశీయాన యోగం.

Floral Separator

ఇంట్లో సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. పెద్దల సహకారంతో పనులు నెరవేరుతాయి. ప్రయాణాల వల్ల లాభపడతారు. సహోద్యోగులతో మాటపట్టింపులు ఉండవచ్చు. అయితే, అధికారుల ఆదరణ లభిస్తుంది. అన్నదమ్ములు, బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి. సాహసంతో పనులు చేసి సత్ఫలితాలు సాధిస్తారు.

White Lightning

తలపెట్టిన పనులలో విజయం చేకూరుతుంది. శుభకార్యాలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అదృష్టం కలిసివస్తుంది. కొన్ని పనులలో ఆలస్యం జరుగుతుంది. ప్రయాణాలలో విజయం చేకూరుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు, రాజకీయ పనులు అనుకూలిస్తాయి. 

ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. రాజకీయ, కోర్టు, ప్రభుత్వ పనులు కలిసివస్తాయి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. న్యాయ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో అనుకూల వాతావరణం. రెట్టింపు శ్రద్ధతో పనులు చేస్తారు.

స్నేహితుల వల్ల కలిసివస్తుంది. బంధువుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. పాతబాకీలు వసూలు అవుతాయి. కొత్త పనుల ప్రారంభంపై మనసు నిలుపుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. తల్లిదండ్రుల సలహాతో పనులు పూర్తవుతాయి. సంతృప్తిగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు.

బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. కొత్త పరిచయాలు అనుకూలిస్తాయి. భూ తగాదాలు కొలిక్కి వస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. పిల్లల విషయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అధికారుల ప్రేరణతో పనులు నెరవేరుతాయి

Open Hands
Multiple Blue Rings

ఆరోగ్యంగా ఉంటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. బంధువర్గ సహకారం ఉంటుంది. వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. అయితే, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. రావలసిన డబ్బు సమయానికి రాకపోవడంతో, చేబదులు అవసరం ఏర్పడవచ్చు. శ్రమ పెరుగుతుంది.

తీర్థయాత్రలు చేస్తారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. పూర్వం ఉన్న ఇబ్బందులు దూరమవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. శ్రమ పెరిగినప్పటికీ, ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలలో నలుగురి సహకారం లభిస్తుంది. భక్తి పెరుగుతుంది.

Cutout
Cream Section Separator

ఆర్థిక సమస్యలతో పనులలో జాప్యం జరుగుతుంది. అన్నదమ్ములు, బంధువర్గం సహకారం లభిస్తుంది. భూ వ్యవహారం కొంత వరకు లాభిస్తుంది. వాహన క్రయ విక్రయాల మూలంగా లాభం జరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో ఆత్మీయుల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు కొంత అనుకూల సమయం.

శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం లభిస్తుంది. భక్తి పెరుగుతుంది. అన్నదమ్ములు, బంధువర్గంతో పనులు కలిసివస్తాయి. అయితే, చేతిలో డబ్బు లేకపోవడంతో కొన్ని పనులలో ఆలస్యం జరుగుతుంది. శారీరక శ్రమ ఉండవచ్చు. ప్రయాణాలు విజయవంతంగా కొనసాగుతాయి.

ఇంటా బయటా సంతృప్తిగా ఉంటారు. ప్రయాణాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కార్యసాఫల్యం ఉంటుంది. కొత్త పరిచయాలతో వివాదాలు ఏర్పడవచ్చు. రాజకీయంగా బాగా కలిసివస్తుంది. ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. కోర్టు కేసులలో విజయం చేకూరుతుంది. 

Floral Separator