Weekly Horoscope

1/5/22 to 7/5/22

White Scribbled Underline

ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. రావలసిన డబ్బు వస్తుంది. కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. బంధువర్గం, స్నేహితులతో పనులు నెరవేరుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భూ సంబంధ వ్యవహారం లాభిస్తుంది

Heptagram
Heptagram

ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల పట్ల గౌరవభావంతో మెలగండి. ఆత్మవిశ్వాసంతో పనులు చేస్తారు. కళాకారులకు అనుకూలం

Floral Separator

ఉత్సాహంతో ఉంటారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారం అనుకూలంగా కొనసాగుతుంది. అయితే కొత్త పనులను కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. కోర్టు వ్యవహారాలలో ఖర్చులు పెరగవచ్చు.

White Lightning

తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. భక్తి పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలమైన వారం. చదువులో రాణిస్తారు. మంచి సంస్థలలో చేరే అవకాశం ఉంది. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.

కోర్టు పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. విద్యార్థులకు శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ప్రయాణాల వల్ల అలసట కలుగుతుంది. తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది.

ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. విద్యార్థులకు శుభవార్త. మంచి సంస్థలలో చేరే అవకాశం ఉంది. స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. బంధువుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది.

స్నేహితుల వల్ల పనులు నెరవేరుతాయి. ఆత్మీయుల సలహాలు పాటిస్తారు. ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. పలుకుబడి పెరుగుతుంది. శుభకార్యాలకు నలుగురి సహకారం లభిస్తుంది. అన్నదమ్ములతో సత్సంబంధాలు ఉంటాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది.

Open Hands

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఆఫీసులో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. మంచి సంస్థలలో చేరతారు. ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది.

Multiple Blue Rings

ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. ఉత్సాహంతో ఉంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అధికారులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. అన్నదమ్ములు, బంధువుల సహకారం లభిస్తుంది.

Cutout
Cream Section Separator

ఇంటా, బయటా ప్రోత్సాహక వాతావరణం ఉంటుంది. అన్ని విషయాలను చర్చించి, నిర్ణయాలు తీసుకుంటారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. పని భారం పెరుగుతుంది.

ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. చదువులో రాణిస్తారు. మంచి సంస్థలో చేరతారు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. భక్తి పెరుగుతుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. పనులలో శ్రమ అధికం. బంధువులతో పనులు నెరవేరుతాయి.

విద్యార్థులకు కలిసి వస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కార్యసాఫల్యం ఉంది. శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం పొందుతారు. ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. బంధు మిత్రులతో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు.

Floral Separator