విమర్శించిన వాళ్లందరికీ థ్యాంక్స్
శరత్‌కుమార్ వారసురాలిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మీ శరత్‌కుమార్.
పదేళ్ల క్రితం సినిమాల్లోకి వచ్చిన వరలక్ష్మీ.. ఎన్నో గుర్తుండిపోయే పాత్రల్లో నటించింది.
క్రాక్ సినిమా చూసిన తర్వాత వరలక్ష్మీ కంటే కూడా జయమ్మ అనే ఆడియన్స్ గుర్తుపెట్టుకున్నారు.
అంతకుముందు తమిళంలో పందెంకోడి 2, సర్కార్ సినిమాల్లో లేడీ విలన్‌గా దుమ్ముదూలిపింది
ఇంత యాక్టింగ్ టాలెంట్‌తో పాటు స్టార్ కిడ్ కావడంతో వరలక్ష్మీ సినిమాల్లోకి ఈజీగా వచ్చిందనే అంతా అనుకుంటారు.
వరలక్ష్మీ సినిమాల్లోకి వచ్చింది మొదలు ఆమెపై విమర్శలే ఎక్కువగా వచ్చాయి. కానీ వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంది.
తానేంటో నిరూపించుకుని విమర్శించిన వారితోనే ప్రశంసలను అందుకుంది. అలా దశాబ్దకాలాన్ని ఇండస్ట్రీలో పూర్తి చేసుకుంది.
ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అయిన సందర్భంగా వరలక్ష్మీ శరత్‌కుమార్ ఎమోషనల్ లెటర్ పోస్టు చేసింది. ఆమె మాటల్లోనే..
పదేళ్ల క్రితం ఇదే రోజు నా మొదటి సినిమా రిలీజైంది. ఇప్పుడు యశోద చిత్రం విడుదలైంది.
ఈ పదేళ్లలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నా.. అయినప్పటికీ వెనుకడుగు వేయకుండా కష్టపడి పనిచేశా.
ఇప్పుడు 45 సినిమాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నన్ను వేలెత్తిచూపిన అందరి వద్ద నేనేంటో నిరూపించుకున్నా.
నన్ను రిజెక్ట్ చేసిన వాళ్లందరికీ థ్యాంక్స్ చెబుతున్నా.. వాళ్ల వల్లే ఇంతలా కష్టపడి పనిచేశా.. స్ట్రాంగ్‌గా మారానంటూ లేఖ పేర్కొంది.