తెలంగాణ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. దసరా శుభఘడియల్లో కొత్త జాతీయ పార్టీ ఆవిర్భవించింది.
దేశ ప్రజల అభ్యున్నతిని కాంక్షిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ నూతన జాతీయ పార్టీని ప్రకటించారు.
ఉద్యమ పార్టీగా మొదలైన తెలంగాణ రాష్ట్ర సమితి.. జాతీయ రాజకీయ పార్టీగా అవతరించింది.
తెలంగాణ రాష్ట్ర సమితి పేరునే భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ ఆయన అధికారిక ప్రకటన చేశారు.
టీఆర్ఎస్ పేరును మారుస్తూ ఇవాళ నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు.
టీఆర్ఎస్ పేరును మారుస్తూ ఇవాళ నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు 283 మంది టీఆర్ఎస్ ప్రతినిధులు ఆ తీర్మానంపై సంతకం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు 283 మంది టీఆర్ఎస్ ప్రతినిధులు ఆ తీర్మానంపై సంతకం చేశారు.
పార్టీ పేరు మార్పునకు సంబంధించిన విషయాన్ని తెలుపుతూ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు.