కూలీగా మారిన

సాయిప‌ల్ల‌వి

స్టార్ హీరోయిన్ అయినా స‌రే ఎలాంటి డాబుల‌కు పోకుండా సింపుల్‌గా ఉంటుంది సాయిప‌ల్ల‌వి.

ఇప్పుడు ఈమె చేసిన ప‌ని తెలిస్తే ఆ విష‌యం నిజ‌మేన‌ని మ‌రోసారి ఒప్పుకుంటారు.

ఉగాది సంద‌ర్భంగా చాలామంది అంగ‌రంగ వైభ‌వంగా పండుగ చేసుకుంటే.. సాయిప‌ల్ల‌వి మాత్రం పొలాల్లో గ‌డిపింది.

కాళ్ల‌కు చెప్పులు లేకుండా సాధార‌ణ కూలీగా మారి ప‌సుపు తోట‌లో ప‌నిచేసింది.

దీనికి సంబంధించిన ఫొటోల‌ను సాయిప‌ల్ల‌వి త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

ఇప్పుడు ఈ ఫొటోలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారాయి. వీటిని చూసి అంద‌రూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

సాయి పల్లవి షేర్ చేసిన ఫొటోలపై అనుపమ పరమేశ్వరన్ స్పందించింది. హార్ట్‌ సింబల్‌ ఇచ్చింది.

నీలా ఎవ్వరూ లేరు అంటూ సాయిప‌ల్ల‌విపై శ్రద్ధా శ్రీనాథ్‌ ప్రశంసల వర్షం కురిపించింది.