సాయిప‌ల్ల‌వి పెళ్లి ఫిక్స‌య్యిందా?

మ‌ల‌యాళ ప్రేమ‌మ్‌తో సినిమాల్లోకి వ‌చ్చి టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌నూ ఫిదా చేసింది సాయిప‌ల్ల‌వి.

ఒక్క సినిమాతోనే స్టార్ హీరోల‌కు ఉన్నంత క్రేజ్‌ను తెచ్చుకుంది.

ఒక‌వైపు డ్యాన్సులు, మ‌రోవైపు యాక్టింగ్‌తో నేచుర‌ల్ బ్యూటీగా ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో స్థానం సంపాదించుకుంది.

సినిమాలో హీరో ఎవ‌ర‌న్న‌ది కాదు.. సాయిప‌ల్ల‌వి ఉంటే చాలు అన్నంత రేంజ్‌లో పేరు తెచ్చుకుంది.

అందుకే సాయిప‌ల్ల‌విని లేడీ ప‌వ‌ర్‌స్టార్ అని పొగిడేశాడు మ‌న లెక్క‌ల మాస్టార్ సుకుమార్‌.

అంత‌లా క్రేజ్ ఉన్న సాయిప‌ల్ల‌వి చేతిలో ప్ర‌స్తుతం ఒక్క సినిమా కూడా లేదు.

ల‌వ్ స్టోరీ, శ్యామ్ సింగ‌రాయ్ వంటి భారీ హిట్స్ ఉన్న‌ప్ప‌టికీ ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క సినిమాను కూడా క‌మిట్ అవ్వ‌లేదు.

ఇందుకు కార‌ణం ఆమె పెళ్లి ఫిక్స‌వ్వ‌డ‌మేన‌ని సినీ ఇండ‌స్ట్రీలో గుసగుస‌లు వినిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం సాయిప‌ల్ల‌వి న‌టించిన విరాట‌ప‌ర్వం సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా రిలీజ్ అయిన త‌ర్వాత ఆమె పెళ్లిపీట‌లు ఎక్క‌నున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

ఆమె స‌న్నిహితులు మాత్రం ఈ వార్త‌ల‌ను కొట్టిపారేస్తున్నారు.

మంచి స్క్రిప్ట్ కోసం సాయిప‌ల్ల‌వి వెయిట్ చేస్తుంద‌ని.. అందుకే తొంద‌ర‌ప‌డి సినిమాల‌కు క‌మిట్ అవ్వ‌డం లేద‌ని చెబుతున్నారు.