అత‌నెవ‌రో బ‌య‌ట‌పెట్టిన ప్రియాంక జువాల్క‌ర్‌

Priyanka Jawalkar

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ టాక్సీవాలా సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక జ‌వాల్క‌ర్‌.

ఆ త‌ర్వాత ఎస్ఆర్ క‌ళ్యాణ‌మండపం సినిమాతో కుర్ర‌కారుకు ఫేవ‌రేట్‌గా మారింది.

ఒక‌వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కు ఎప్పుడూ ద‌గ్గ‌ర‌గా ఉంటుంది.

ఈ క్ర‌మంలో రీసెంట్‌గా ప్రియాంక పోస్ట్ చేసిన ఓ పిక్ వైర‌ల్‌గా మారింది.

దీనికి కార‌ణం ఆ ఫొటోలో ఫేస్ క‌నబ‌డ‌కుండా ఓ కుర్రాడు ప్రియాంక ఎదురుగా కూర్చోవ‌డ‌మే.

ఆ కుర్రాడు మ‌రెవ‌రో కాద‌ని.. యంగ్ క్రికెట‌ర్ వెంక‌టేశ్ అయ్య‌ర్ అని ప‌లు యూట్యూబ్ ఛాన‌ల్స్ క‌థ‌నాలు రాసుకొచ్చాయి.

బాయ్‌ఫ్రెండ్‌తో ప్రియాంక జ‌వాల్క‌ర్‌ ఇలా చెట్టాప‌ట్టాల్ వేసుకుని తిరుగుతుంద‌ని వీడియోల్లో పేర్కొన్నాయి.

త‌న‌పై ఇలాంటి పుకార్లు రావ‌డంతో ప్రియాంక జ‌వాల్క‌ర్ స్పందించింది.

వైర‌ల్ అయిన‌ ఫొటోను పోస్ట్ షేర్ చేస్తూ.. అందులో ఉన్న‌ది తమ‌కు సాయం చేయ‌డానికి వ‌చ్చిన వ్య‌క్తి అని క్లారిటీ ఇచ్చింది.

బాయ్‌ఫ్రెండ్ అంటూ వార్త‌లు వ‌స్తుండ‌టంతో ఏంటి సంగ‌తని అమ్మ అడుగుతుంద‌ని చెప్పుకొచ్చింది.

ఇలాంటివి రాయ‌డం ఇప్ప‌టికైనా మానుకుంటే మంచిద‌ని ప్రియాంక జ‌వాల్క‌ర్‌ సూచించింది.