అప్పుడు నా హృద‌యం ముక్క‌లైంది !!

# Pooja Hegde

కాలం చేసే ఇంద్రజాలం ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. తన జీవితంలో కూడా అలాంటి మేజిక్‌ జరిగిందని చెప్పింది పూజా హెగ్డే.

స్కూల్ డేస్‌లో హృతిక్ రోష‌న్‌ను పూజా హెగ్డే ఎంత‌గానో అభిమానించేద‌ట‌.

త‌న‌కు ప‌న్నెండేళ్లు ఉన్న‌ప్పుడు కోయి మిల్‌గ‌యా సినిమా విడుద‌లైంది.

ఆ స‌మయంలో హృతిక్‌తో ఎలాగైనా ఫొటో తీయించుకోవాల‌ని కెమెరాతో సినిమా ప్రీమియ‌ర్ షోకు వెళ్లిందట‌.

అక్క‌డ హృతిక్ క‌నిపించ‌గానే ప‌ట్ట‌రాని సంతోషప‌డింది. అయితే ఫొటో కోసం ప్ర‌య‌త్నిస్తుండ‌గానే అత‌ను స్టేజి దిగి వెళ్లిపోయాడు.

ఆ సంఘ‌ట‌న‌తో ఒక్క‌సారిగా త‌న హృద‌యం ముక్క‌లైపోయిన‌ట్లు అనిపించింద‌ని చెప్పింది పూజా .

అప్ప‌ట్నుంచి కోయి మిల్‌గ‌యా సినిమా పోస్ట‌ర్ ఎక్క‌డ క‌నిపించినా బాధ‌ప‌డేదాన్ని అని పేర్కొంది.

అదే 10 ఏండ్ల త‌ర్వాత హృతిక్ ప‌క్క‌న మొహంజొదారోలో న‌టించే ఛాన్స్‌  రావ‌డంతో ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయ‌ని పేర్కొంది.

నాడు ఫొటో కోసం తపించిన తాను హృతిక్‌ సరసన నటించే అవకాశం సొంతం చేసుకోవడం ఓ అందమైన కలలా అనిపించిందని పూజాహెగ్డే పేర్కొంది.