ఆ 2 సినిమాల‌పైనే కేథ‌రిన్ ఆశ‌లు

Catherine Tressa

సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ద‌శాబ్దానికి పైగా అవుతున్నా కూడా ఇంకా గుర్తింపు కోసం క‌ష్ట‌ప‌డుతూనే ఉంది కేథ‌రిన్‌.

2010లో సినీ ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కేథ‌రిన్‌.. ద‌క్షిణాది భాష‌లు అన్నింటిలోనూ న‌టించింది. కానీ ఏ భాష‌లోనూ స్టార్ స్టేట‌స్‌ను అందుకోలేక‌పోయింది.

2013లో చ‌మ్మ‌క్ ఛ‌ల్లో, ఇద్ద‌ర‌మ్మాయిల‌తో.. సినిమాల‌తో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన కేథ‌రిన్‌కు మొద‌ట్లో అవ‌కాశాలు బాగానే వ‌చ్చాయి.

కానీ స‌రైనోడు త‌ప్ప ఏ సినిమా కూడా బ్లాక్‌బ‌స్ట‌ర్‌ కాలేదు. దీంతో చాలావ‌ర‌కు అవ‌కాశాలు త‌గ్గిపోయాయి.

ఆఫ‌ర్లు త‌గ్గ‌డ‌మే కాకుండా ప్రేక్ష‌కులు కూడా కేథ‌రిన్‌ను దాదాపు మ‌రిచిపోయారు.

Catherine

ఫేడ‌వుట్ అయిపోతున్న స‌మ‌యంలో కేథ‌రిన్‌కు 2 పెద్ద సినిమాల్లో న‌టించే ఛాన్స్ వ‌చ్చింది.

ఆ రెండు సినిమాలు కూడా షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. అవే బింబిసార‌, మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం.

Catherine

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌ బింబిసార సినిమా ఆగ‌స్టు 5న విడుద‌ల అవుతుంది.

మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం సినిమా ఆగ‌స్టు 12న విడుద‌ల కానుంది.

ఈ సినిమా కేథ‌రిన్ పేరుకు సెకండ్ హీరోయిన్ అయినా.. ఫ‌స్టాప్‌లో ఈమెదే కీల‌క పాత్ర అని స‌మాచారం.

ప్ర‌స్తుతం ఈ రెండు సినిమాల‌పైనే కేథ‌రిన్ భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంది.

రెండు వారాల గ్యాప్‌లో వ‌స్తున్న ఈ సినిమాల్లో ఏ ఒక్క‌టి హిట్ అయినా ఆమెకు ఢోకా ఉండ‌దు. లేదంటే  కెరీర్ సందిగ్ధంలో ప‌డే అవ‌కాశం ఉంది.

అందుకే కేథరిన్ కూడా ఈ రెండు సినిమాల‌పై చాలా ఆశ‌లు పెట్టుకుంది. మ‌రి ఆమె ఆశ‌లు నెర‌వేర‌తాయో లేదో చూడాలి.