తెలంగాణ అబ్బాయితో
అనుష్క పెండ్లి.. నిజమెంత?
టాలీవుడ్‌లో హీరోలను పక్కనబెడితే హీరోయిన్లలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే అందరికీ గుర్తొచ్చేది అనుష్కనే.
40 ఏండ్లు దాటినా పెండ్లి చేసుకోకుండా ఇంకా సింగిల్‌గానే ఉంది మన జేజమ్మ.
అందుకే అనుష్క పెండ్లి విషయంపై టాలీవుడ్‌లో ఎప్పుడూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది.
ప్రభాస్, అనుష్క లవ్‌లో ఉన్నారని త్వరలోనే ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కుతారని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి.
తమ మధ్య స్నేహమే తప్ప ఇంకా ఏమీ లేదని చెప్పినా వీరిద్దరిపై ఇలాంటి వార్తలు ఆగలేదు.
అయితే చాలా రోజులుగా సైలెంట్‌గా ఉన్న అనుష్క పెళ్లి విషయం ఇప్పుడు మళ్లీ వైరల్‌గా మారింది.
అనుష్క పెళ్లి ఫిక్సయిందని.. త్వరలోనే ఆమె పెండ్లి పీటలు ఎక్కబోతుందని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ వార్తల ప్రకారం.. తెలంగాణకు చెందిన ఒక గోల్డ్ స్మిత్ వ్యాపారితో స్వీటీ పెళ్లిని ఆమె కుటుంబసభ్యులు ఫిక్స్ చేశారట.
త్వరలోనే వీళ్లిద్దరికీ ఎంగేజ్‌మెంట్ చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
వచ్చే ఏడాది మొదట్లో అనుష్క పెండ్లి జరుగుతుందన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.