బోడ కాక‌ర తింటే క‌లిగే లాభాలేంటి?

#Spiny Gourd Health Benefits

బోడకాకరలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో లభిస్తాయి.

బోడకాకర జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తుంది.

బోడ‌కాక‌ర‌లో ఉండే ఫొలేట్ల వల్ల శరీరంలో కొత్త కణాలు వృద్ధి చెందుతాయి. ఇవి గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఉపయోగపడుతాయి.

సాధారణ కాకర తరహాలోనే బోడకాకర కూడా డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది.

వర్షాకాలం విరివిగా లభించే వీటిని తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు, ఇతర అలర్జీలు దూరం అవుతాయి.

కంటి వ్యాధులు, క్యాన్స‌ర్ల బారిన ప‌డ‌కుండా బోడ కాక‌రలోని కెరొటెనాయిట్లు అడ్డుకుంటాయి.

బోడ‌కాక‌ర‌లోని విటమిన్-సి ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతుంది. దీనిలో సమృద్ధిగా లభించే ప్లవనాయిడ్ల వల్ల వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలు తగ్గిస్తాయి.

బోడ కాక‌ర‌ తరచూ తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

బోడకాకర వండేటప్పుడు పైనున్న బొడిపెలను తీసేయకుండా వండాలి.

బోడకాకర కాయలను పూర్తిగా నూనెలో వేపుకొని తినకూడదు. అలా చేయడం వల్ల ఎలాంటి పోషకాలు శరీరానికి అందవు.

దీన్ని సగంగా కట్ చేసి ఉప్పు, ఉల్లిగడ్డ, కారం వేసి నిప్పులపై కాల్చుకుని తింటే ఆరోగ్యానికి మంచిది.