Jaggery

బెల్లం తింటే క‌లిగే లాభాలివే..

Health Benefits

బెల్లం పోషకాల గని. వర్షాకాలంలో సాయంత్రం పూట స్నాక్స్ తయారీలో కూడా బెల్లాన్ని ఉపయోగించవచ్చు.

పండుగల వేళ చేసే నైవేద్యాలు, తరచూ ఇంట్లో చేసుకునే పిండివంటల్లో ఎక్కువగా బెల్లాన్ని వాడితే మంచిది.

వేయించిన వేరుశనగ పప్పు, బెల్లం కలిపి తింటే రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా రక్తపోటు సమస్య నుంచి కూడా బయటపడవచ్చు.

రోజూ ఆహారంలో 50 గ్రాముల బెల్లం తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్ల సమస్య తగ్గిపోతుంది.

పిల్లల ఎదుగుదలకు, ఎముకలు బలంగా ఉండటానికి బెల్లంలోని కాల్షియం పనికొస్తుంది.

బెల్లంలోని పొటాషియం రక్తపోటు నివారణ, నియంత్రణకు దోహదం చేస్తుంది.

తరచూ బెల్లాన్ని తినడం వల్ల మహిళల్లో రక్తం శాతం పెరుగుతుంది. ఐర‌న్ అంది ర‌క్త‌హీన‌త స‌మ‌స్య దూర‌మ‌వుతుంది.

బెల్లం సహజసిద్ధమైన క్లీన్సింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుంది. శ్వాసకోశ గ్రంథులు, ఊపిరితిత్తులూ, పొట్ట వంటి వాటిని శుభ్రపరుస్తుంది.

శరీరంలోని వివిధ రకాల ఎంజైమ్‌లను ఎసిటిక్ యాసిడ్‌గా మార్చి, జీర్ణ వ్యవస్థ పనితీరుని మెరుగు పరుస్తుంది.

ఆయుర్వేదంలో పొడిదగ్గు, జలుబు, అస్తమా వంటి సమస్యలకు వాడే మందుల్లో బెల్లం ఓ పదార్థంగా ఉంటుంది. 

త‌ర‌చూ బెల్లం తీసుకోవడం వల్ల కండరాలకు శక్తి అందుతుంది. 

బెల్లంలో అధిక మోతాదులో ఉండే మెగ్నీషియం రక్తనాళాలు, నరాల పని తీరుకు బాగా పనిచేస్తాయి.