Black pepper
నల్ల మిరియాలు తింటే కలిగే లాభాలివే..
Health Benefits
నల్ల మిరియాలు ఆహారానికి రుచిని అందించడమే కాకుండా.. మనకు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.
ఘాటుగా ఉండే నల్ల మిరియాలను రోజూ భోజనంలో తీసుకుంటే అనేక లాభాలున్నాయి. అవేంటంటే..
“
నల్ల మిరియాల్లో విటమిన్ ఎ, సి, కె, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఖనిజాలు అధిక మోతాదులో ఉన్నాయి.
నల్ల మిరియాలను ఆహారంలో తీసుకోవడమే కాకుండా.. నోట్లో వేసి చప్పరించినా లాభం ఉంటుంది. దీని ద్వారా శరీరంలోని మెటబాలిజం క్రమబద్దం అవుతుంది.
బరువు తగ్గడంలో నల్ల మిరియాలు దోహదపడుతాయి. శరీరంలోని ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ను పెంపొందించి.. ఫ్యాట్ సెల్స్‌ను తగ్గిస్తాయి.
నల్ల మిరియాలు శరీరంలో ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ను పెంపొందించి.. ఫ్యాట్ సెల్స్‌ను తగ్గిస్తాయి.
చల్లదనం కోసం తాగే మజ్జిగపై పుదీనా, నిమ్మరసంతో చేసే జ్యూస్‌పై కూడా కొద్దిగా ఈ మిరియాల పొడి చిలకరించి తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
జలుబు, దగ్గుతో బాధపడుతున్నవారికి నల్ల మిరియాలు తక్షణ ఉపశమనం ఇస్తాయి.
నల్లమిరియాలను పొడి చేసుకుని గ్లాసుడు వేడి పాలల్లో వేసుకుని తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది.
గొంతు, శ్వాస సంబంధిత సమస్యల్ని తగ్గించే గుణం మిరియాలలో ఉంటుంది.