సబ్జా గింజలు..
ఆరోగ్యానికి ఎంతో మేలు
#Basil Seeds Health Benefits
సబ్జా గింజలు చూసేందుకు చిన్నవిగా ఉన్నా అవి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇవి అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి.
అధిక బరువు సమస్యతో బాధ పడేవారికి సబ్జా గింజలు చక్కని ఔషధం.
సబ్జా గింజలను స్వల్ప పరిమాణంలో తిన్నా చాలు. త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది.
సబ్జా గింజలను తిన్న తర్వాత ఎక్కువ సమయం ఆకలి వేయదు. దీంతో త్వరగా బరువు తగ్గవచ్చు.
సబ్జా గింజలు నేరుగా కాకుండా నీటిలో వేసుకొని తింటే జీర్ణ సంబంధ సమస్యలు కూడా తగ్గిపోతాయి.
గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.
సబ్జా గింజలను పొడి చేసి గాయాలపై వేసి కట్టు కడితే త్వరగా మానుతాయి. ఇన్‌ఫెక్షన్లు కూడా దరిచేరవు.
సబ్జా గింజలను నీటిలో కలిపి తింటే తలనొప్పి ఇట్టే దూరమవుతుంది. మైగ్రేన్ నుంచి కూడా వెంటనే ఉపశమనం పొందవచ్చు.
రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు సబ్జా గింజల్లో ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్త సరఫరా కూడా మెరుగవుతుంది.
సబ్జా గింజలను తీసుకోవడం వల్ల బీపీ కూడా అదుపులో ఉంటుంది.
గోరువెచ్చని నీటిలో తేనె, అల్లం రసంతో పాటు సబ్జా గింజలను కలపాలి. ఈ మిశ్రమాన్ని తాగడం వల్ల దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు నయమవుతాయి.
నీటిలో వేసిన సబ్జా గింజలు తినడం వల్ల డిప్రెషన్ వెంటనే దూరమవుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.
యాంటీ బయోటిక్, యాంటీ ఫంగల్ గుణాలు సబ్జా గింజల్లో పుష్కలంగా ఉన్నాయి. ఇవి అలర్జీలు, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.
కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు సబ్జా గింజలు తింటే ఫలితం ఉంటుంది.
నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. శరీరంలో ఎక్కడైనా వాపులు ఉంటే తగ్గిపోతాయి.
ఉదయాన్నే సబ్జా గింజల్ని నీటిలో వేసుకొని తింటే ఎంతో శక్తి లభిస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.