బెండ‌కాయ తింటే క‌లిగే ప్ర‌యోజ‌నాలు

#Health Benefits of Okra

బెండ‌కాయ‌లోని పీచు ప‌దార్థం ర‌క్తంలోని షుగర్ లెవ‌ల్స్‌ను క్ర‌మబ‌ద్దీక‌రిస్తుంది. మ‌ధుమేహ రోగులు వీటిని ఏ మాత్రం సంశ‌యించ‌కుండా తినొచ్చు.

క్లోమంలోని బీటా కణాలను ఉత్పత్తి చేసి ఇన్సులిన్‌ను ఉత్ప‌త్తి పెంచేలా చూసేందుకు బెండ‌కాయ ప‌నిచేస్తుంది.

బెండకాయలో ఉండే పీచు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండె జబ్బులు రాకుండా చూస్తుంది.

రోజూ బెండ తింటే అందులోని పాలిఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్లలాగా పనిచేసి గుండె రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను నివారిస్తుంది.

రోజులో శరీరానికి అవసరమైనంత విటమిన్ సి బెండకాయ తింటే లభిస్తుంది.

విటమిన్ సి కారణంగా వ్యాధి నిరోధక శక్తి పెరిగి పలు రకాల ఇన్‌ఫెక్షన్‌లు, రోగాలు దరిచేరవు.

అధిక బరువుకు చెక్ పెట్టేందుకు కూడా ఇది బాగా పనిచేస్తుంది.

హానిచేసే ఫ్రీరాడికల్స్‌ను నాశనం చేసి వాటి బారి నుంచి కేన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాలు రాకుండా బెండకాయ కీలకపాత్ర పోషిస్తుంది.

బెండకాయలో పుష్కలంగా లభించే పీచు కారణంగా కొలొరెక్టల్ కేన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.

చిన్న పిల్లల్లో పుట్టుకతో వచ్చే మెదడు సంబంధిత సమస్యలకు బెండకాయ మంచి మందులాగా పనిచేస్తుంది.

బెండలోని ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బీ9 వంటివి మెదడు నరాలకు బలాన్నిస్తాయి.